Breaking News

రథయాత్రలో కాజాలకు గిరాకీ..రూ.100 కోట్లు దాటిన వ్యాపారం!

Published on Mon, 07/27/2026 - 11:38

పూరీ: జగన్నాథ రథయాత్ర సందర్భంగా  ‘పూరీ కాజా' విక్రయాలలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. పది రోజుల ఉత్సవాల్లో దాదాపు రూ.100 కోట్ల విలువైన కాజా అమ్ముడైనట్లు వర్తకులు చెబుతున్నారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఈ  తియ్యని పదార్థానికి గిరాకీ అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాది రథయాత్రకు ముప్పై లక్షలకు పైగా భక్తులు పూరీకి తరలివచ్చారు. దీంతో శ్రీమందిర్ ఆనంద్ బజార్, అడపా మండప్ ఆనంద్ బజార్‌తో పాటు గ్రాండ్ రోడ్, నగర వీధులు, పూరీ-భువనేశ్వర్ హైవే వెంట వెలిసిన వందలాది దుకాణాల్లో కాజా విక్రయాలు జోరుగా సాగాయి.

గత సంవత్సరాలతో పోలిస్తే విక్రయ కేంద్రాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. భక్తులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఒక్కొక్కరు 2 నుంచి 5 కిలోల వరకు కాజాను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన ప్రీమియం రకం కిలో సుమారు రూ.400 పలుకగా, సాధారణ రోడ్డు పక్కన విక్రయించే రకాలు రూ.200 నుంచి రూ.300 వరకు అమ్ముడయ్యాయి.

పండుగ రద్దీని ఆసరా చేసుకుని కొన్ని చోట్ల సాధారణ కాజాను కూడా ‘కాళీయ భోగం’ అంటూ కొందరు విక్రేతలు అమాయక భక్తులను మోసగించారనే ఆరోపణలు వినిపిస్తునాయి. జగన్నాథ సంప్రదాయాల పవిత్రతను దెబ్బతీసే ఈ చర్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం శ్రీమందిర్ ఆనంద్ బజార్‌లోనే రూ.40 కోట్ల విలువైన మహాప్రసాదం అమ్ముడైనట్లు అంచనా. మరోవైపు పూరీ కాజాకు అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పటికీ, దీనికి ఇప్పటివరకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించలేదు. దీని ప్రత్యేకతను కాపాడేందుకు, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి జీఐ ట్యాగ్ ఇవ్వాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది.
 

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)