Breaking News

పుల్వామా దాడికి ‘ఈ-కామర్స్’ సాయం.. సంచలన వివరాలు వెల్లడి

Published on Wed, 07/09/2025 - 10:32

న్యూఢిల్లీ: పుల్వామా దాడి(2019)కి పాల్పడిన ఉగ్రవాదులు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం ద్వారా పేలుడు పదార్థాలను సేకరించడం, తరలించడం చేశారని మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను పర్యవేక్షించే అంతర్ ప్రభుత్వ సంస్థ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తెలిపింది. ఉగ్రవాద సంస్థలు  ఇటీవలి కాలంలో డిజిటల్ సాధనాలను, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాలను  విరివిగా వినియోగిస్తున్నాయని, నిధులను సేకరించడం, తరలించడం, నిర్వహించడం మొదలైనవాటికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలను ఉపయోగించుకుంటున్నాయని ఎఫ్‌ఏటీఎఫ్‌ వెల్లడించింది.

2019 నాటి పుల్వామా దాడి, 2022 నాటి గోరఖ్ నాథ్ ఆలయ సంఘటనలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయని ఎఫ్‌ఏటీఎఫ్‌ పేర్కొంది. 2019 పుల్వామా దాడిలో ఈ-కామర్స్ సాయంతో పేలుడు పదార్థాలను సేకరించారని, 2022లో గోరఖ్‌నాథ్ ఆలయంపై జరిగిన దాడి ఘటనలో ఐఎస్‌ఎస్‌ నిధులు సమకూర్చడానికి ‘పేపాల్‌’, వీపీఎన్‌లను ఉపయోగించారని ఎఫ్ఏటీఎఫ్ తన రిపోర్టులో వెల్లడించింది. ఫుల్వామా ఉగ్రదాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీ)ల పేలుడు శక్తిని పెంచడానికి ఉపయోగించే కీలకమైన పదార్థాలను ఉగ్రవాద సంస్థలు ఈ కామర్స్‌ ప్లాట్‌ఫారం అమెజాన్ నుంచి తెప్పించుకున్నాయని తేలింది.

పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్  ఈ దాడికి పాల్పడింది.ఈ దాడిలో లాజిస్టిక్స్ కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రత్యేక పాత్ర పోషించాయని పరిశోధకులు చెబుతున్నారు. 2022లో గోరఖ్ నాథ్ ఆలయంపై ఐఎస్‌ఎస్‌ ప్రేరేపిత వ్యక్తి దాడి చేశాడు.  ఈ ఘటనలో పాల్గొన్న నిందితుడు ‘పే పాల్’ సాయంతో రూ. 6.7 లక్షలను విదేశాలకు బదిలీ చేశాడని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. అలాగే నిందితుడు తాను  రహస్యంగా ఉండేందుకు వీపీఎన్‌ సేవలను వినియోగించుకున్నాడని పేర్కొంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)