Breaking News

ఏడేళ్లలో 60% పెరిగిన పప్పుధాన్యాల ఉత్పత్తి 

Published on Tue, 09/23/2025 - 06:28

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గడిచిన ఏడేళ్లలో పప్పు ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని నీతిఆయోగ్‌ వెల్లడించింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి 2015–16తో పోలిస్తే ఏకంగా 60 శాతం పెరిగాయంది. ఇదే సమయంలో దిగుమతులు 10శాతానికి పడిపోయాయని తెలిపింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి సమతుల్య, స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపింది. 

అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మిగులు దేశంగా మారుతుందని నీతిఆయోగ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన ‘ఆత్మనిర్భరత లక్ష్యం వైపు పప్పుధాన్యాల వృద్ధిని వేగవంతం చేసేలా వ్యూహాలు, మార్గాలు’అనే నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. సుమారు 80 శాతం ఉత్పత్తి వర్షాధార ప్రాంతాలపై ఆధారపడి, 5 కోట్లకు పైగా రైతులు, వారి కుటుంబాల జీవనోపాధికి ఊతమివ్వడంతోపాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు పప్పుధాన్యాల రంగం చాలా కీలకంగా ఉందని నివేదిక పేర్కొంది.  

లక్ష్యం చేరాలంటే కేంద్రం మద్దతే కీలకం 
2015–16లో 1.63 కోట్ల టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి జరగ్గా, ఆ సమయంలో ఏకంగా ఏడాదికి 60 లక్షల టన్నుల మేర దిగుమతులు చేసుకునే అవసరముండేదని నీతి ఆయోగ్‌ తెలిపింది. 2022–23 నాటికి, ఉత్పత్తి 59.4 శాతం పెరిగి 2.60 కోట్ల టన్నులకు ఉత్పత్తి పెరగడంతో పప్పు ధాన్యాల దిగుమతి 29 శాతం నుంచి ఏకంగా 10.4 శాతానికి తగ్గిందని తెలిపింది. 2030 నాటికి దేశంలో 3.05 కోట్ల టన్నులు, 2047 నాటికి 4.57 కోట్ల టన్నుల ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది. 

2036 నాటికి 36 లక్షల టన్నుల మిగులుకు దేశం చేరాలంటే సాగులో ఎదురవుతున్న నిర్దిష్ట అడ్డంకులను తొలగించేందుకు తగిన వ్యవసాయ వ్యూహాలను అనుసరించాల్సి ఉందని సూచించింది. పప్పు ధాన్యాల ఉత్పత్తితో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలు దాదాపు 55 శాతం వాటా కలిగి ఉన్నాయని, మొదటి 10 రాష్ట్రాలు జాతీయ ఉత్పత్తిలో 91 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంది. 

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, పోషక భద్రతను నిర్ధారించడానికి, పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా దేశం లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవరోధాలను అధిగమించడం చాలా ముఖ్యమని పేర్కొంది. పంటల ఉత్పాదకతను పెంచేందుకు యాంత్రీకరణ, బయో–ఫెరి్టలైజేషన్‌ పరిష్కారాలను ప్రోత్సహించాలని, వాతావరణ అనుకూలత, తెగులు నిర్వహణ వ్యూహాలను ముందుగానే రైతులకు చేరవేసే వ్యవస్థలను వృధ్ధి చేయాలని సిఫార్సు చేసింది.

 దీంతో పాటే రియల్‌ టైం డేటా ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, దిగుబడులు మెరుగు పరిచేందుకు, ఉత్తమ పద్ధతులను అవలంబించడాన్ని ప్రోత్సహించడానికి రైతులకు శిక్షణ ఇచ్చేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ఉత్పత్తి అంశాలతో పాటు తక్కువ ఆదాయ కుటుంబాలకు ప్రోటీన్‌ భద్రత కోసం ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌), పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాల్లో పప్పుధాన్యాలను ఎక్కువగా కేటాయించాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కిచెప్పింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)