Breaking News

2026 ప్రారంభంలోనే పీఎస్‌ఎల్‌వీ సీ62 ప్రయోగం!

Published on Tue, 12/30/2025 - 05:28

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ62 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.  ఈ ప్రయోగాన్ని 2026 జనవరి 5న గాని లేదా 10న నిర్వహించేందుకు సిద్ధం చేస్తోంది. ఈ నెల 26న ఈవోఎస్‌–ఎన్‌1 (అన్వేష్‌) ఉపగ్రహం షార్‌ కేంద్రానికి చేరుకు­ంది. క్లీన్‌ రూమ్‌లో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించి రాకెట్‌కు అనుసంధానం చేయనున్నారు.

షార్‌­లోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ బిల్డింగ్‌ (ఫిఫ్‌)­లో నాలుగు దశల పీఎస్‌ఎల్‌వీ సీ62 రాకెట్‌ అనుసంధానం పనులు పూర్తి చేసి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాకె­ట్‌ అనుసంధానం తరువాత ఫిఫ్‌ నుంచి ఎంఎస్‌టీకి తరలించి అక్కడ ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రి­య చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో ఈవోఎస్‌–ఎన్‌1 (అన్వేష్) అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపబోతున్నారు.

రాకెట్‌ ఆఖరి దశ అయిన పీఎస్‌–4 దశతో స్పెయిన్‌కి చెందిన స్పానిష్‌ స్టార్టప్‌ ఆర్బిటల్‌ ఫారాడైమ్‌తో ప్రయోగాత్మకంగా ఓ పరీక్షను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. 25 కిలోల బరువైన కెస్ట్రెల్‌ ఇనీషియల్‌ డిమాన్‌్రస్టేటర్‌ (కేఐడీ) అనే క్యాప్సూల్స్‌ను పీఎస్‌–4 ద్వారా తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించడం కోసం దక్షిణ ఫసిఫిక్‌ మహా సముద్రంలో ఒక స్పాష్‌ డౌన్‌ జోన్‌ను గుర్తించారు. దీంతో పాటు ఇందులో 18 పేలోడ్స్‌ను కూడా పంపిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)