Breaking News

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Published on Tue, 04/29/2025 - 03:41

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులు సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాలు అందుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన నలుగురికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. వైద్యరంగంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి (పద్మవిభూషణ్‌), కళారంగంలో నందమూరి బాలకృష్ణ (పద్మభూషణ్‌), మాడుగుల నాగఫణిశర్మ (పద్మశ్రీ) పురస్కారాలు అందుకున్నారు.

మిరియాల అప్పారావు (పద్మశ్రీ) తరఫున ఆయన కుమార్తె యడవల్లి శ్రీదేవి అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జి.కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, శివరాజ్‌సింగ్‌ చౌహాన్, జితేంద్రసింగ్, ఏపీ మంత్రి లోకేశ్‌ దంపతులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖలు పాల్గొన్నారు.  

బాలకృష్ణకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు 
సాక్షి, అమరావతి: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ వేర్వేరుగా అభినందనలు తెలిపారు. ‘కళ, సేవ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’ అని సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’లో పోస్టులో చేశారు. ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణది ప్రత్యేక స్థానం. ఆయన ప్రజాసేవలో, కళాసేవలో మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను..’ అని పవన్‌కళ్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)