Breaking News

3 గంటల ముందే లైట్లార్పితే.. గర్భిణుల్లో మధుమేహానికి చెక్‌! కీలక విషయాలు

Published on Sun, 03/12/2023 - 05:00

న్యూఢిల్లీ: గర్భిణులు పడుకోవడానికి కొద్ది గంటల ముందే ఇంట్లో లైట్లను పూర్తిగా ఆర్పేయడమో, బాగా తగ్గించడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. కంప్యూటర్, మొబైల్‌ స్క్రీన్ల వెలుతురు కూడా ఈ ఆర్పేయాల్సిన లైట్ల జాబితాలోకే వస్తుంది! అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ వర్సిటీ తాజా అధ్యయనం ఈ మేరకు తేల్చింది. నిద్రకు ముందు చాలాసేపు లైట్ల వెలుగులో గడిపితే గ్లూకోజ్‌ నియంత్రణపై ప్రభావం పడుతుందని అధ్యయనానికి సారథ్యం వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మింజీ కిమ్‌ తెలిపారు.

‘‘741 మంది గర్భిణులపై చేసిన ప్రయోగంలో ఇది నిర్ధారణ అయింది. అందుకే వీలైతే గర్భధారణ సమయంలో కంప్యూటర్లు, మొబైల్, టీవీ వాడకానికి పూర్తిగా దూరంగా ఉండటం చాలా మంచిది. కుదరని పక్షంలో కనీసం వాటిని వీలైనంత డిమ్‌గా మార్చుకోవాలి’’ అని సూచించారు. నిద్రకు ముందు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తికడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుందని కూడా హెచ్చరించారు!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)