Breaking News

కులగణనకు రెడీ

Published on Fri, 10/17/2025 - 04:51

న్యూఢిల్లీ: దేశంలో జన గణనకు రంగం సిద్ధమవుతోంది. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయబోతున్నారు. జన గణనలో మొదటి దశకు సంబంధించిన ప్రి–టెస్టు ఎక్సర్‌సైజ్‌ను ఈ ఏడాది నవంబర్‌ 10 నుంచి 30వ తేదీ వరకు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన చోట్ల ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

నవంబర్‌ 1 నుంచి 7వ తేదీ దాకా సెల్ఫ్‌–ఎన్యూమరేషన్‌కు కూడా అవకాశం కలి్పస్తున్నట్లు రిజి్రస్టార్‌ జనరల్, సెన్సెస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ చెప్పారు. 2026 ఏప్రిల్‌ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 దాకా దేశవ్యాప్తంగా జన గణనను చేపట్టబోతున్నారు. ఇది రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో హౌస్‌లిస్టింగ్‌ ఆపరేషన్, హౌసింగ్‌ షెడ్యూల్‌(హెచ్‌ఎల్‌ఓ) ప్రక్రియ, రెండో దశలో జన గణన చేపడతారు. మొదటి దశకు సంబంధించి ప్రి–టెస్టు ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇళ్ల సంఖ్యను ప్రయోగాత్మకంగా లెక్కిస్తారు. 

ఆయా ఇళ్ల స్థితిగతులు, వసతుల వివరాలు సేకరిస్తారు. ఈసారి జన గణనతోపాటు కుల గణన కూడా చేపట్టబోతున్నారు. ఇది పూర్తిగా డిజిటల్‌ సెన్సెస్‌ కావడం విశేషం. ప్రతి పౌరుడి కులం, సామాజిక–ఆర్థిక పరిస్థితుల వివరాలను నమోదు చేస్తారు. జన గణన, కుల గణన అనేది మహా యజ్ఞమే. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లతోపాటు 1.3 లక్షల మంది సిబ్బందిని నియమిస్తున్నారు. దేశంలో జన గణన ప్రక్రియ మొదలైన తర్వాత ఇది 16వ జన గణన, స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఎనిమిదో జన గణన.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)