Breaking News

పుణ్యక్షేత్రాల ప్రయాగరాజ్‌

Published on Thu, 12/26/2024 - 06:39

ప్రయాగరాజ్‌: మహా కుంభమేళాకు ఆతిథ్యమివ్వనున్న ప్రయాగరాజ్‌(Prayagraj) పుణ్యక్షేత్రాల నగరంగా కీర్తికెక్కింది. దాదాపు 1,400 సంవత్సరాలుగా చైనా ప్రజలకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. భారత సాంస్కృతిక వారసత్వం పట్ల చైనాకు ఆకర్షణ నాటినుంచే బలంగా ఉందని ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏడవ శతాబ్దపు చైనీస్‌ యాత్రికుడు యాత్రికుడు జువాన్జాంగ్‌ తన రచనలలో పేర్కొన్న విషయాలను ప్రభుత్వం ప్రస్తావించింది.  

హర్షవర్ధనరాజు పరిపాలనలో... 
చరిత్రలోకి వెళ్తే.. హ్యూయెన్‌ త్సాంగ్‌ అని కూడా పిలుచుకునే జువాన్జాంగ్‌ 16 ఏళ్ల పాటు భారతదేశంలోని (India) వివిధ ప్రాంతాలపై అధ్యయనం చేశారు. అందులో భాగంగా ప్రయాగరాజ్‌నూ సందర్శించారు. క్రీ.శ. 644లో హర్షవర్ధన రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాన్ని ఆయన ప్రశంసించారు. ధాన్యం సమృద్ధిగా ఉందని చాటి చెప్పారు. అలాగే అనుకూలమైన వాతావరణం, ఆరోగ్యం, సమృద్ధిగా పండ్లు ఇచ్చే చెట్లు ఉన్న ప్రాంతంగా ప్రయాగ్‌రాజ్‌ను ఆయన అభివర్ణించారు. ప్రయాగరాజ్, దాని పరిసరాల్లోని ప్రజలు ఎంతో వినయంగా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని, అంకితభావంతో నేర్చుకుంటున్నారని తన రచనల్లో వర్ణించారు. అందుకే ప్రయాగరాజ్‌కు ‘తీర్థరాజ్‌’ (అన్ని పుణ్యక్షేత్రాల రాజు) బిరుదును వచ్చిందని వాస్తవాన్ని పురావస్తు సర్వేలు, అధ్యయనాలు మరింత బలపరుస్తున్నాయి. 

ఆసక్తికర వర్ణణలు..  
ప్రయాగరాజ్‌ సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి జువాన్జాంగ్‌ ‘సి–యు–కి’పుస్తకంలో రాశారని పురావస్తుశాఖ పేర్కొంది. జువాన్జాంగ్‌ రచనలు పురాతన కాలంలో ప్రయాగరాజ్‌ గురించి ఆసక్తికరంగా వర్ణించాయి. ‘ప్రయాగ్‌రాజ్‌లో పెద్ద ఎత్తున మతపరమైన ఉత్సవాలు జరిగాయని, 5లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో ఎందరో మహారాజులు, పాలకులు పాల్గొన్నారు. ఈ గొప్ప రాజ్యం యొక్క భూభాగం సుమారు 1,000 మైళ్ళ వరకు విస్తరించి ఉంది.

ప్రయాగ రాజ్‌ రెండు పవిత్ర నదులైన గంగా, యమునా మధ్య ఉంది.’అని జువాన్జాంగ్‌ పేర్కొన్నారు. నగరంలోని ప్రస్తుతం కోట లోపల పాతాళపురి ఆలయం గురించి కూడా రాశారు. ఇక్కడ ఒకే నాణే న్ని సమర్పించడం, వెయ్యి నాణేలను దానం చేయడంతో సమానమని ప్రజలు నమ్ముతున్నారని లిఖించారు. ప్రయాగరాజ్‌లో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసించే విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా– 2025 (Maha Kumbh Mela 2025) జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాలను పంచుకుంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)