Breaking News

ఉత్సవ విగ్రహమే ఇంత సమ్మోహనంగా ఉందంటే..

Published on Thu, 01/18/2024 - 09:49

అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆలయ ట్రస్టు ఎంతగానో కృషి చేస్తోంది. సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండటంతో రామాలయానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రతిరోజూ వెలుగులోకి వస్తోంది. 

ఈ క్ర‌మంలోనే అత్యంత ఆకర్షణీయమైన రామ్‌లల్లా విగ్రహానికి సంబంధించిన తొలి ఫొటో వెలుగులోకి వ‌చ్చింది. పల్లకీలో కూర్చున్న రామ్‌లల్లా ఆలయ ప్రాంగణంలో ఊరేగారు. అయితే ఇది గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహం కాదు. ఇది ప్రతీకాత్మక విగ్రహం. గర్భగుడిలో ప్రతిష్టించే బాలరాముని విగ్రహాన్ని ఈనెల 18న(ఈరోజు) రామాలయ ప్రాంగణానికి తీసుకురానున్నారు.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కర్నాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ నూతన రామాలయంలో ప్రతిష్ఠించే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. జనవరి 22న జరిగే పవిత్రోత్సవానికి ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆలయ ట్రస్టు తొలుత బాలరాముని విగ్రహాన్నే ఆలయ ప్రాంగణంలో ఊరేగించాలని భావించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి, శ్రీరాముని ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించి, భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలిగించారు. 

బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
ఇది కూడా చదవండి: 22న స్కూళ్లకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే..

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)