Breaking News

ప్రజ్వల్‌కు చీర చిక్కు

Published on Thu, 09/12/2024 - 07:07

బనశంకరి: మహిళలపై అత్యాచారం కేసులో అరెస్టైన జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు బాధితురాలి చీర పెద్ద సమస్య తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆ మహిళ చీరను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పరీక్షలకు పంపారు. బాధితురాలి నుంచి నాలుగు చీరలను స్వాదీనం చేసుకున్న సిట్‌ అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపించారు. 

చీరల్లో వీర్యం, వెంట్రుకలు లభించినట్లు తేలింది. దీంతో ఇవి ఎవరివో  తెలుసుకో­వ­డానికి ప్రజ్వల్‌ రేవణ్ణకు డీఎన్‌ఏ పరీక్షలు చేపట్టారు. అవి ప్రజ్వల్‌వే అని నిర్ధారణ అయితే కేసు మ­రింత బిగుసుకునే అవకాశం ఉంది.  ఇంటి పనిమనిషి­పై అత్యాచారం కేసులో ప్రజ్వల్‌పై కోర్టులో సిట్‌ చార్జి­షీట్‌ దాఖలు చేయగా, అందులో ఈ డీఎన్‌ఏ పరీక్షల త­తంగాన్ని పేర్కొన్నారు. అంతేగాక వైద్య పరీక్షల నివేదిక పెండింగ్‌లో ఉంది. ల్యాబ్‌ నుంచి నివేదిక అందిన వెంటనే అదనపు చార్జిషిట్‌ వేస్తామని కోర్టుకు సిట్‌ తెలిపింది. 

గదిలోకి పిలిచి అఘాయిత్యం   
హొళెనరసిపురలో బన్నికోడ ఫాంహౌస్‌లో ప్రజ్వల్‌ మంచి నీరు తేవాలని మహిళకు సూచించాడు.  చెంబులో నీరు తీసుకుని రూమ్‌లోకి వెళ్లగానే ప్రజ్వల్‌ తలుపులు లాక్‌చేసి నా దుస్తులు తొలగించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై వీడియో తీశాడు. బెంగళూరు బసవనగుడి ఇంట్లో పనిచేయడానికివెళ్లినప్పుడు కూడా ప్రజ్వల్‌ ఇదేవిధంగా ప్రవర్తించాడు. ఇళ్లు తుడవడానికి గదిలోకి పిలిచాడు, నేను వెళ్లకపోవడంతో గదమాయించాడు. గదిలోకి వెళ్లగానే తలుపు గడియ పెట్టి అత్యాచారం చేశాడు. ఎక్కడైనా నోరువిప్పితే వీడియో నీ కుమారునికి చూపిస్తానని బెదిరించారు. ఎంపీ అనే భయంతో మౌనంగా ఉండిపోయాను అని బాధిత మహిళ వాంగ్మూలం ఇచ్చినట్లు చార్జిషిట్‌లో తెలిపారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)