Breaking News

ఇండియా గేట్‌, రాష్ట్రపతి భవన్‌.. అంతటా అంథకారం.. కారణమిదే..

Published on Sun, 03/23/2025 - 13:37

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని చారిత్రక ప్రదేశాలకు ఉన్నట్టుండి ఒక్కసారిగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడాన్ని ఎప్పుడైనా చూశారా?. రాత్రివేళ ఎప్పుడూ కాంతులీనే ఈ ప్రాంతాల్లో అంథకారం అలముకుంటే ఎలా ఉంటుంది? ఇటువంటి దృశ్యం శనివారం కనిపించింది. డబ్ల్యూడబ్యూఎఫ్‌ ఇండియా ఎర్త్‌ అవర్‌ సెలబ్రేషన్ 2025 కింద ఈ విధంగా చారిత్రక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

శనివారం సాయంత్రం ఇండియా గేట్, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, విక్టోరియా మెమోరియల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పలు చారిత్రక ప్రదేశాలలో లైట్లు ఆపివేశారు. ఈ ఏడాది 19వ ఎర్త్ అవర్(Earth Hour) ప్రపంచ జల దినోత్సవంతో పాటు జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీతకారుడు, డబ్ల్యూడబ్యూఎఫ్‌ ఇండియా హోప్ అండ్ హార్మొనీ రాయబారి శంతను మొయిత్రా  తన సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఎర్త్ అవర్ సందర్భంగా రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు చారిత్రక ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం ద్వారా ఢిల్లీలో దాదాపు 269 మెగావాట్ల విద్యుత్తును ఆదా  చేశారు.

ఎర్త్ అవర్ అనేది విద్యుత్తును ఆదా చేసే ప్రచార కార్యక్రమం. ప్రజలు తమ దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ప్రపంచంపై పడే భారాన్ని తగ్గించవచ్చని ఎర్త్‌డే చెబుతుంది. నీటిని ఆదా చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single-use plastic) వాడకాన్ని తగ్గించడం, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా భూమిని కాపాడవచ్చని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈ ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఎర్త్ అవర్ సందర్భంగా 206 మెగావాట్ల విద్యుత్ ఆదా అయిందని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: అమర వీరులకు ప్రముఖుల నివాళులు

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)