Breaking News

దేశ జనాభా నియంత్రణపై బాబా రామ్‌దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 05/26/2023 - 13:21

దేశంలో జనాభా నియంత్రణపై యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రస్తుతం దేశంలో జనాభా అత్యధికంగా ఉన్నదన్నారు. అందుకే దేశ జనాభా నియంత్రణకు పార్లమెంట్‌లో చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. దేశంలో జనాభా 140 కోట్లకు చేరుకున్నదని, ఇంతకుమించి అధికంగా జనాభా పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పుడున్న జనాభాకు దేశంలో రైల్వే, ఎయిర్‌ పోర్టు, కాలేజీ, యూనివర్శిటీ, ఉపాధి కల్పన సేవలు అందించడమే చాలా ఎక్కువన్నారు. అందుకే పార్లమెంట్‌లో జనాభా నియంత్రణకు చట్టం చేయాలని, అ‍ప్పుడే దేశంపై అధికభారం పడదన్నారు. ఉత్తరాఖండ్‌కు తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ అందించినందుకు ప్రధాని మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌కు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

హరిద్వార్‌ అనేది ఉత్తరాఖండ్‌లో గర్వించదగిన ప్రాంతమని అన్నారు. ఢిల్లీ- డెహ్రాడూన్‌ మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడపడం ఆనందదాయకమన్నారు.ఇది దేవభూమికి దక్కిన గౌరవమని అన్నారు. గతంలోనూ బాబా రామ్‌ దేవ్‌ జనాభా నియంత్రణ గురించి మాట్లాడారు. ఏ కుటుంబంలోనైనా ఇద్దరికిమించి అధికంగా పిల్లలు ఉంటే వారికి కొన్ని హక్కులను వర్తింపజేయకూడదన్నారు. దేశంలో జనాభా పెరిగితే, ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందకు భారత్‌ సిద్ధంగా లేదన్నారు.దేశ జనాభా 150 కోట్లు దాటకుండా చూడాలని బాబా రామ్‌దేవ్‌ సూచించారు.  

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)