Breaking News

ఢిల్లీ టెర్మినల్‌పై కొత్త చర్చ.. మోదీనా లేక కాంగ్రెసా?

Published on Fri, 06/28/2024 - 12:39

ఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్‌-1 రూఫ్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఇక, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. అలాగే, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

కాగా, విమానాశ్రయంలో పైకప్పు కూలిన ప్రదేశాన్ని శుక్రవారం ఉదయం రామ్మోహన్‌ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలిపోయిన టర్మినల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమాన ప్రయాణీకులు అందరికి తగిన ఏర్పాట్లు చేశాం. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటాం. ఈ టెర్మినల్‌ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించినట్టు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. అది నిజం కాదు. 2009లో టెర్మినల్‌ నిర్మాణం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు.. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం అందించనున్నట్టు తెలిపారు. అలాగే, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రామ్మోహన్‌ పరామర్శించారు.

ఇక, ఈ ప్రమాదంపై కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ టెర్మినల్‌ను ప్రారంభించారు. 2024వ ఏడాదిలోనే దీన్ని ప్రారంభించారు. మోదీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. బీజేపీ హయాంలో గత పదేళ్లలో పలు నిర్మాణాలు కూలిపోతున్నాయి. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)