Breaking News

అటల్ టన్నెల్‌లో చిక్కుకున్న పర్యాటకులు.. కాపాడిన రెస్క్యూ టీమ్‌!

Published on Wed, 01/31/2024 - 08:45

హిమాచల్ ప్రదేశ్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వారికి పలు ఇబ్బందులు  కూడా ఎదురవుతున్నాయి. మంగళవారం (జనవరి 30) హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

హిమాచల్‌తో పాటు దేశంలోని ఎగువ ప్రాంతాలైన కులు మనాలిలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా చలి మరింతగా పెరిగింది. పర్యాటకులు హిమపాతాన్ని చూసి, మురిసిపోతూ, దానిలో ఆడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో హిమపాతం కారణంగా పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అటల్ టన్నెల్‌లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టిందని సూపరింటెండెంట్ లాహౌల్ స్పితి మయాంక్ చౌదరి తెలిపారు.

రాబోయే కొద్దిరోజులపాటు హిమాచల్‌లో వాతావరణం  ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని రిడ్జ్, మాల్ రోడ్‌లలో గట్టి పోలీసు భద్రత  ఏర్పాటు చేశారు.
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)