Breaking News

మోదీని పొగిడిన భార్యకు తలాక్‌...

Published on Sat, 08/24/2024 - 08:40

బహ్రెయిచ్‌: అయోధ్యలో అభివృద్ధికి ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ కారణమంటూ పొగడటమే ఆ మహిళ చేసిన నేరం. ఇందుకు ఆగ్రహిస్తూ భర్త ఆమెకు మూడుసార్లు తలాక్‌ చెప్పేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు భర్తతోపాటు అతడి ఏడుగురు కుటుంబసభ్యులపైనా కేసులు నమోదు చేశారు. బహ్రెయిచ్‌ జిల్లా మొహల్లా సరాయ్‌కి చెందిన బాధితురాలికి గతేడాది డిసెంబర్‌లో అయోధ్యకు చెందిన అర్షద్‌తో వివాహమైంది. మెట్టినింటికి వెళ్లాక అయోధ్యలో రోడ్లు, ఆ నగరం, అక్కడి వాతావరణం ఆమెకు నచ్చాయి.

ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. ప్రధాని మోదీ, సీఎం యోగియే ఇందుకు కారణమని తెలిపింది. దీంతో, అర్షద్‌కు కోపం వచ్చి ఆమెను వెంటనే పుట్టింటికి పంపేశాడు. బంధువులు నచ్చజెప్పి, ఆమెను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమెను కొడుతూ, తిడుతూ వేధిస్తున్నాడు. ప్రధాని మోదీ, సీఎం యోగిపై దుర్భాషలాడుతున్నాడు. అత్త, మరదళ్లు, మరుదులు కలిసి ఆమెను చంపేందుకు యత్నిస్తున్నారు. అర్షద్‌ చివరికామెకు మూడుసార్లు తలాక్‌ చెప్పాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)