Breaking News

ఉనికే లేని దేశానికి ఉత్తుత్తి ఎంబసీ.. ఘరానా మోసగాడి అరెస్ట్‌

Published on Wed, 07/23/2025 - 16:36

దేశ రాజధాని శివారు ప్రాంతమైన ఘాజియాబాద్‌లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఉనికే లేని ఓ దేశానికి ఉత్తుత్తి రాయబార కార్యాలయాన్ని సృష్టించిన ఓ మోసగాడు.. ఉద్యోగాలు, ఇతర దందాల పేరుతో లక్షలు గడించాడు. ఆ కేటుగాడి మోసానికి పోలీసులకే షాక్‌ కొట్టినంత పనైంది. 

హర్షవర్ధన్‌ జైన్‌.. ఘజియాబాద్‌లో విలాసవంతమైన రెండతస్తుల భవనం, లగ్జరీ కార్లతో రాయబారిగా బిల్డప్‌ ఇస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తాను ‘వెస్టార్కిటికా’(Westarctica) దేశపు రాయబారినని చెబుతూ దందాలు చేశాడు.  జనాల్ని బాగా నమ్మించడానికి ఫ్యాన్సీ నెంబర్‌ ప్లేట్లతో ఉన్న కార్లలో తిరగసాగాడు. వీటికి తోడు.. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాజకీయ ప్రముఖులతో దిగిన ఫొటోలను(మార్ఫింగ్‌) ఆ ఆఫీస్‌లో ఉంచాడు. 

జూలై 22న ఉత్తరప్రదేశ్‌లోని స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్ ఈ నకిలీ రాయబార కార్యాలయం గుర్తించింది. దీంతో ఆ భవనంపై దాడులు నిర్వహించగా.. అసలు విషయం బయపడింది. దీంతో హర్షవర్ధన్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.44 లక్షల నగదు, విదేశీ కరెన్సీతో పాటు.. దౌత్య నంబర్ ప్లేట్లు ఉన్న 4 లగ్జరీ కార్లు, 12 మైక్రోనేషన్ల దౌత్య పాస్‌పోర్ట్‌లు, విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టాంపులున్న పత్రాలు, 34 దేశాల స్టాంపులు, 18 దౌత్య నంబర్ ప్లేట్‌లను స్వాధీనం చేసుకున్నారు. హర్షవర్ధన్ జైన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరో వైపు విదేశీ ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నాడని.. నకిలీ డిప్లొమాటిక్ పత్రాలు, ఫోటో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2011లో చట్ట విరుద్ధంగా శాటిలైట్‌ ఫోన్‌ కలిగి ఉన్నందుకు అతడిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. హర్షవర్ధన్‌ జైన్‌ కార్యకలాపాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.

కొసమెరుపు.. 
వెస్టార్కిటికా నిజంగా దేశమా?.. ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. అమెరికా నేవీ అధికారి ట్రావిస్ మెక్‌హెన్రీ 2001లో ‘వెస్టార్కిటికా’ను స్థాపించాడు. మంచు ఖండం అంటార్కిటికాలో 6.2 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాడు. ఇదొక మైక్రోనేషన్‌. అయితే లీగల్‌గా దీనిని ఏ దేశం గుర్తించలేదు. అలా దీనికి ఉనికి లేకుండా పోయింది. ఇలాంటి పేరును మన ఘరానా మోసగాడు వాడేసుకుని.. చివరకు కటకటాల పాలయ్యాడు.

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)