Breaking News

ఆదిపురుష్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌

Published on Fri, 06/16/2023 - 18:24

బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌, కృతి సనన్‌ జంటగా వచ్చిన మైథలాజికల్‌ మూవీ ఆదిపురుష్‌ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. 

శుక్రవారం ఆదిపురుష్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హిందూ సేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ చిత్రం కోట్లాది హిందువుల మనోభావాలను  దెబ్బతీయడంతో పాటు రామాయణాన్ని, అలాగే శ్రీరాముడిని, భారత సంప్రదాయాల్ని ఎగతాళి చేసినట్లు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారాయన. 

సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదనేది హిందూ సేన ప్రధాన అభ్యంతరం. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో, అలాగే తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లోనూ ప్రధాన పాత్రల వర్ణనకు.. ఆదిపురుష్‌లో పాత్రలను చూపించిన తీరుకు చాలా తేడాలు ఉన్నాయని పిటిషన్‌లో ప్రస్తావించారు. 

హిందూ దేవుళ్లైన రాముడు, సీత, హనుమంతుడు, రావణుడికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని లేదంటే సరిదిద్దడానికి చిత్రయూనిట్‌కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా రావణ బ్రహ్మ పాత్రధారి(సైఫ్‌ అలీఖాన్‌)ను గడ్డంతో ఏదో క్రూరుడిగా చూపించినట్లు ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది హిందూ సేన. ప్రామాణిక‌మైన వాల్మీకి రామాయ‌ణం గురించి తెలుసుకోవాలంటే పండితుల్ని, సాహిత్య‌కారుల్ని  సంప్ర‌దించాల్సిందేనంటూ ఈ చిత్ర ప్రారంభంలోనే నోట్‌ ఇవ్వడం గమనార్హం.

ఇదీ చదవండి: ఆదిపురుష్‌ ఆ ఓటీటీలోనే.. వచ్చేసిన క్లారిటీ

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)