Breaking News

తగ్గనున్న ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర

Published on Mon, 06/24/2024 - 13:11

భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. త్వరలో రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ఇది ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది.

ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధరను తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.  ఇప్పటి వరకు ప్లాట్‌ఫారం టిక్కెట్ ధర రూ. 10గా  ఉంది. దీని ధర రూపాయి తగ్గి రూ. 9 కానుంది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. రైల్వే స్టేషన్‌ లోనికి వెళ్లాలంటే ఎవరైనా సరే ప్లాట్‌ ఫారం టిక్కెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణానికి వెళ్లేవారు టిక్కెట్‌ తీసుకుంటారు కాబట్టి వారు ప్రత్యేకంగా ప్లాట్‌ఫారం టిక్కెట్‌ తీసుకోనవసరం లేదు. అయితే ఎవరినైనా రైలు నుంచి రిసీవ్‌ చేసుకునేందుకు రైల్వే స్టేషన్‌ లోనికి వెళ్లేవారు తప్పనిసరిగా ప్లాట్‌ఫారం టిక్కెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ప్లాట్‌ఫారం టిక్కెట్ లేకుండా ఎవరైనా స్టేషన్‌లోనికి ప్రవేశిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్లాట్‌ఫారం టిక్కెట్ కూడా రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే ​మార్గాలలో ఒకటి. ప్రస్తుతం ప్లాట్‌ఫారం టికెట్ ధర రూ.10. అయితే జూన్ 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్లాట్‌ఫారం టిక్కెట్లపై జీఎస్టీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ప్లాట్‌ఫారం టికెట్‌తో పాటు రిటైరింగ్ రూమ్, బ్యాటరీతో నడిచే కారు తదితర సేవల రుసుము నుంచి కూడా జీఎస్టీని తొలగించారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న 5శాతం ఉన్న జీఎస్టీ భారం ‍ప్రయాణికులకు తగ్గనుంది. ఫలితంగా ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర రూ. 10 నుంచి రూ. 9కి చేరనుంది. 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)