Breaking News

ర్యాగింగ్‌ భూతానికి పీహెచ్‌డీ స్కాలర్‌ బలి

Published on Sat, 08/09/2025 - 11:07

కోల్‌కతా: ‘నేను ఈ ప్రపంచం కోసం అస్సలు రూపొందలేదు’ అంటూ కోల్‌కతాకు చెందిన పీహెచ్‌డీ స్కాలర్‌ ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. 
పశ్చిమ బెంగాల్‌లోని నాడియాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కొన్ని గంటల ముందు అతను సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ నోట్‌ను పోస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణిలోగల ఒక ప్రభుత్వ పరిశోధనా సంస్థలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి ఒకరు తనను తోటి విద్యార్థులు ర్యాగింగ్‌
చేస్తున్నారని విద్యాసంస్థ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే వారు దీనిని పట్టించుకోలేదు. దీంతో తీవ్రంగా కలత చెందిన అతను క్యాంపస్‌ ఆవరణలోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడని సమాచారం. మృతుడిని అనమిత్ర రాయ్ గా పోలీసులు గుర్తించారు, నార్త్ 24 పరగణాస్ లోని శ్యామ్ నగర్‌కు చెందిన అనమిత్ర రాయ్ కోల్ కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో బయాలజీలో పీహెచ్ డీ చేస్తున్నాడు. గురువారం సాయంత్రం ప్రయోగశాలలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను కల్యాణిలోని ఎయిమ్స్ కు తరలించారు శుక్రవారం ఉదయం అక్కడ మరణించాడని వైద్యులు ధృవీకరించారు.

అనమిత్ర రాయ్ తన చివరి లేఖలో విద్యాసంస్థ యాజమాన్యం ఉదాసీన వైఖరిపై పలు ఆరోపణలు చేశారు. తనకు జరిగిన ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. తోటి పీహెచ్‌డీ విద్యార్థి సౌరభ్ బిశ్వాస్ తనను, తన సహచరులను వేధింపులకు గురిచేశాడని, దీనిపై యాంటీ ర్యాగింగ్ సెల్‌కు పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ, వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అనమిత్ర పేర్కొన్నారు.  విద్యార్థుల వ్యవహారాల మండలి సభ్యులు, సూపర్‌వైజర్ తన ఫిర్యాదుల కంటే ల్యాబ్ ప్రతిష్టకే ప్రాధాన్యత ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

అభ్యంతరకరంగా ప్రవర్తించిన బిశ్వాస్‌ చేస్తున్న పీహెచ్‌డీ నిరాకరించాలని,  ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని రాయ్ కోరారు. తాను ఈ ప్రపంచం కోసం  సృష్టించబడలేదని అనిపిస్తుందని, అయితే ఇక్కడ కొంతమంది మంచి మనుషులు,స్నేహితులు తారసపడ్డారని, వారి ప్రేమ దొరికిందని అనమిత్ర రాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇకపై జీవితాన్ని కొనసాగించలేను. జీవితంలో ఎన్నడూ కనుగొనని శాంతిని మరణంలో పొందగలనంటూ అనమిత్ర రాయ్ ఆ లేఖను ముగించారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)