Breaking News

బీహార్‌లో అయోధ్యను మించిన రామాలయం

Published on Wed, 07/10/2024 - 09:15

అయోధ్య రామాలయం.. ఈ మాట వినగానే ఇది శ్రీరామునికి సంబంధించిన ఘనమైన ఆలయం అని మనకు అనిపిస్తుంది. అయితే దీనికి మించిన ఆలయం బీహార్‌లో నిర్మితమవుతోంది. పైగా ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కూడా సంతరించుకోనుంది.

బీహార్‌లోని తూర్పు చంపారణ్‌ జిల్లాలో కేసరియా-చాకియా రహదారిపై నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ పనులు 2023, జూన్ 20 నుండి ప్రారంభమయ్యాయి. ఇటీవలే రెండో దశ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని మహావీర్ టెంపుల్ ట్రస్టు కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ తెలిపారు. రెండవ దశలో 26 అడుగుల ఎత్తున ఉండే ప్లింత్‌ను నిర్మిస్తారు. దీన్ని పటిష్టం చేసేందుకు 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో కాంక్రీట్‌ పైకప్పును నిర్మిస్తారు. ఆ తర్వాత మూడు అంతస్తుల నిర్మాణం సాగనుంది. ఒక్కో అంతస్తు 18 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు.

22 దేవాలయాల సముదాయమైన ఈ ఆలయంలో రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన శిల్పకళా దృశ్యాలు కనిపించనున్నాయి.  అలాగే ప్రధాన దేవతల ఆలయాలు నిర్మితం కానున్నాయి. ఆలయ నిర్మాణ పనులు ఏడాదిన్నర, రెండేళ్లలో పూర్తి చేయాలని మహావీర్ టెంపుల్ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ రామాయణ దేవాలయ రెండో దశ నిర్మాణానికి రూ.185 కోట్లు ఖర్చవుతుందని అంచనా.  ప్రధాన శిఖరం 270 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది అయోధ్యలో రామ మందిరం కంటే  అతిపెద్ద రామాలయంగా పేరు తెచ్చుకోనుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు