Breaking News

Kerala: మెలిపడిన ప్రయాణికుని దవడ.. క్షణాల్లో అద్భుతం చేసిన రైల్వే వైద్యుడు

Published on Sun, 10/19/2025 - 09:47

పాలక్కాడ్: ఎటువంటి ప్రమాదం లేదా వ్యాధి విషయంలో తక్షణం స్పందిస్తే, పెద్ద ముప్పును తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. సరిగ్గా దీనినే ఆచరించి చూపారు కేరళకు చెందిన ఒక వైద్యుడు. ఈ ఘటన పాలక్కాడ్ జంక్షన్‌లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ఆ వైద్యుడిని మెచ్చుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే పాలక్కాడ్ జంక్షన్‌లో కన్యాకుమారి-దిబ్రుగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల ప్రయాణికుని దవడ అకస్మాత్తుగా మెలిపడింది. దీంతో అతను బాధతో విలవిలలాడిపోయాడు. తోటి ప్రయాణికులు కూడా అతనిని చూసి, ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రైల్వే వైద్యాధికారి డాక్టర్ జితిన్ పీఎస్ బాధితుడిని పరీక్షించారు. నిముషాల వ్యవధిలోనే అతని దవడను మాన్యువల్‌గా చక్కదిద్దారు. బాధితుడు ఆ వైద్యునికి  కృతజ్ఞతలు తెలిపాడు. తరువాత రైలులో ఎక్కి, తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
 

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా ఆ వైద్యుడిని మెచ్చుకుంటున్నారు. బాధితుడు ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడ్డాడని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని దక్షిణ రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు. ప్రయాణికుల భద్రత, సంక్షేమం విషయంలో తమ వైద్య సిబ్బంది అంకితభావానికి ఇదొక నిదర్శనమని వారు పేర్కొన​్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)