Breaking News

ఆకతాయి పనితో కదులుతున్న ట్రైన్‌ నుంచి దూకిన ప్రయాణికులు

Published on Sun, 08/11/2024 - 17:18

కదులుతున్న ట్రైన్‌లో మంటలు చెలరేగుతున్నాయనే అకతాయిలు చేసిన పుకార్లు ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్‌ బిల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న ట్రైన్‌లో మంటలు చెలరేగుతున్నాయని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కదులుతున్న ట్రైన్‌ నుంచి బయటకు దూకారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు రైల్వే పోలీస్‌ అధికారులు తెలిపారు.

మొరాదాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే బిల్పూర్ స్టేషన్ సమీపంలోని హౌరా-అమృత్‌సర్ మెయిల్ జనరల్ కోచ్‌లో ఈ సంఘటన జరిగింది . గాయపడిన వారిని అన్వారీ (26), అఖ్తరీ (45), కుల్దీప్ (26), రూబీ లాల్ (50), శివ శరణ్ (40), చంద్రపాల్ (35)లుగా గుర్తించారు. ఆరుగురు ప్రయాణికులను షాజహాన్‌పూర్ మెడికల్ కాలేజీలో చేర్చినట్లు జీఆర్‌పీ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రెహాన్ ఖాన్ వెల్లడించారు.  

రైల్వే స్టేషన్‌లో గందరగోళం
రైలు బరేలీలోని బిల్పూర్ స్టేషన్‌కు చేరుకోగానే గందరగోళం నెలకొంది. రైలులో మంటలు చెలరేగిపోయాయనే పుకారుతో ప్రయాణికులు ఆందోళనకు గురైరయ్యారు. భయాందోళనతో ట్రైన్‌ చైన్‌ లాగారు. చాలా మంది ప్రయాణికులు ఇంకా కదులుతున్న రైలు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు.

రైల్లో చోటు చేసుకున్న ఘటనపై రెహాన్ ఖాన్ మాట్లాడుతూ.. కొంతమంది ఆకతాయిలు గాల్లో మంటలు వ్యాపించాయనే పుకార్లు పుట్టించినట్లు మా దృష్టికి వచ్చింది. పుకార్లు చేసిన అనంతరం ట్రైన్‌ చైన్‌ లాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు.  భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)