Breaking News

ఏపీకి 11.536 ఎకరాలు.. తెలంగాణకు 8.245 ఎకరాలు

Published on Sun, 03/17/2024 - 05:26

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ విభజన పూర్తయింది. ఏపీకి 11.536 ఎక­రాలు, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటా­యిస్తూ శనివారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వు­లిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజన జరగలేదు.

ఇటీ­వల రెండు రాష్ట్రాల ప్రభుత్వాల అధికా­రుల సమన్వ­యంతో విభజన పూర్తయింది. ఢిల్లీలోని అశో­కా రోడ్‌లోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.9,913.505 కోట్లు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పంపకాల్లో భాగంగా ఏపీకి 58.32 శాతం వాటా దక్కగా, తెలంగాణకు 41.68 శాతం ఆస్తులు దక్కాయి. 

ఏపీ భవన్‌కు ఇలా
19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవన్‌ను రెండు భాగాలుగా విభజించారు. విభజనలో భాగంగా ఏపీకి 11.536 ఎకరాలను అప్పగించారు. దీనిలో 5.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏపీ భవన్, 4.315 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సింగ్‌ హాస్టల్, 2.396 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్‌ను కేటాయించారు. 0.512 విస్తీర్ణంలో ఉన్న ఇంటర్నల్‌ రోడ్డు, 0.954 విస్తీర్ణంలోని శబరీ బ్లాక్‌ కొంత భాగాన్ని అప్పగించారు. ఏపీకి కేటాయించిన స్థలం విలువ రూ.5,781.416కోట్లు. 

తెలంగాణ భవన్‌కు ఇలా.. 
విభజనలో భాగంగా తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. దీనిలో మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న శబరీ బ్లాక్, 5.245 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్‌ను కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 8.245 ఎకరాల విలువ రూ.4,132.089 కోట్లు.  

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)