Breaking News

అది ప్రపంచంలోని ఏకైక 5 నదుల సంగమ ప్రాంతం.. మన దేశంలో ఎక్కడున్నదంటే..

Published on Sun, 07/16/2023 - 13:44

నదులు.. ఏ దేశానికైనా జీవనాధారంగా భాసిల్లుతుంటాయి. నదులు మనిషి సమస్త అవసరాలను తీరుస్తుంటాయి. మానవ నాగరికత నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందింది. నదులు తమ దారిన తాము వెళ్లిపోతూ, తమకు అడ్డుపడే వాటిని కూడా తమతోపాటు తీసువెళ్లిపోతాయని చెబుతుంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు,లేదా మూడు నదులు కలవడాన్ని మనం చూసుంటాం. ఉదాహరణకు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదులు కలవడంతో అక్కడి త్రివేణీ సంగమం ఏర్పడింది. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఐదు నదులు కలిసే ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఆ ప్రాంతం మన దేశంలోనే ఉంది. 

ప్రపంచంలో ఎక్కడా కనిపించని కొన్ని అద్భుతాలు భారత్‌లో కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని పచ్‌నద్‌కు సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారత కాలంలో పాండవులు తమ ప్రయాణంలో ఈ ప్రాంతంలో బస చేశారని చెబుతారు. పాండవులలో ఒకడైన భీముడు ఈ ప్రాంతంలోనే బకాసురుడిని వధించాడని చెబుతారు. శ్రీరాముని భక్తుడైన తులసీదాసు ఈ ప్రాంతంలోనే పర్యటించాడని చెబుతారు. 

బుందేల్‌ఖండ్‌ పరిధిలోని జాలౌన్‌లో ఐదు నదులు సంగమిస్తాయి. ఈ ప్రాంతాన్నే పచ్‌నద్‌ అంటారు. ప్రకృతి సౌందర్యానికి, హిందూ ఆధ్యాత్మిక నమ్మకాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఏడాదిలో ఒకసారి ఇక్కడ మేళా జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడికి లెక్కకుమించిన సంఖ్యలో భక్తులు వస్తారు. పచ్‌నద్‌ను మహాతీర్థరాజం అని కూడా అంటారు. ప్రపంచంలో ఐదు నదులు సంగమించే ప్రాంతం ఇదొక్కటే కావడం విశేషం. ఇక్కడ యమున, చంబల్‌, సింధు, పహుజ, కన్వరి నదులు సంగమిస్తాయి. 

పచ్‌నద్‌ సంగమతీరంలో బాబా సాహెబ్‌ మందిరం ఉంది. ఈయన గోస్వామి తులసీదాసు సమకాలికుడని చెబుతారు. ఈయన ఇక్కడే  తపమాచరించి, ఒక గుహలో విలీనమైపోయారని స్థానికులు చెబుతుంటారు. ఈ పంచనదుల సంగమప్రాంతంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే కాన్ఫూర్‌, దేహాత్‌, జాలౌన్‌, ఔర​‍య్యా ప్రాంతాల రైతులకు మేలు జరగనుంది. 
ఇది కూడా చదవండి: అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్‌’కు ఎందుకు మినహాయింపు? 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు