Breaking News

ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా.. ఫ్లాట్‌లో

Published on Mon, 05/01/2023 - 20:42

జైపూర్‌: ఓ ఇంటి యజమాని పాడు పని చేశాడు. అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్‌లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్‌రూం, బాత్‌రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు.

ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ పోవడంతో అమ్మాయిలు ఎలక్ట్రిషన్‌ను పిలిపించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను వైర్లు పరిశీలిస్తుండగా ఐదారు సీక్రెట్ కెమెరాలు కన్పించాయి. దీంతో కంగుతిన్న ముగ్గురు అమ్మాయిలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు యజమానిని ఏఫ్రిల్ 27న అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.  న్యాయస్థానం నిందితుడికి మే 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
చదవండి: నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్.. ధూమ్ సినిమాను తలపించిన దొంగతనం

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని పేరు రాజేంద్ర సోని. సీసీటీవీల వ్యాపారం చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్‌ విభాగంలో ఎంటెక్ చేసిన ఇతడు ఐటీ నిపుణుడు.  స్పై కెమెరాలు ఎలా ఇన్‌స్టాల్ చేయాలో బాగా తెలుసు. అందుకే అమ్మాయిలు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు డూప్లికేట్ కీ ఉపయోగించి ఫ్లాట్‌లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఉచిత వైఫై అందిస్తానని చెప్పి రూటర్ కూడా ఇన్‌స్టాల్ చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు.

ఇలా సీక్రెట్‌గా వీడియోలూ చూడటం తన బలహీనత అని చెప్పుకొచ్చాడు యజమాని. చాలా కాలంగా ఇలా చేస్తున్నట్లు తెలిపాడు. కాగా.. ఈ ముగ్గురు అమ్మాయిలు 8 నెలల క్రితం ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను ఇన్ని రోజులు గమనించలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. పాపం ప్యాంటు ఊడి ఇబ్బందిగా..

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)