Breaking News

రాజ్యసభలో తీవ్ర రగడ

Published on Fri, 08/09/2024 - 04:51

న్యూఢిల్లీ:  ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌పై అనర్హత వేటు అంశం పట్ల రాజ్యసభలో అలజడి రేగింది. ప్రతిపక్ష సభ్యులు, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వినేశ్‌ ఫోగాట్‌ అంశంపై సభలో చర్చించేందుకు చైర్మన్‌ అనుమతి ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభ నుంచి వెళ్లిపోయారు.

 ఎగువ సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వినేశ్‌ ఫోగాట్‌పై అనర్హత అంశంపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. అందుకు ధన్‌ఖడ్‌ అంగీకరించకపోవడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయిన్‌ ఆయనతో వాగ్వాదానికి దిగారు.

   డెరెక్‌ ఓబ్రెయిన్‌తోపాటు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది.  ఫోగాట్‌పై చర్చించేందుకు ధన్‌ఖడ్‌ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు.  విపక్ష ఎంపీల తీరు పట్ల ధన్‌ఖడ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.  సభలో ఉండలేనని చెప్పారు. భారమైన హృదయంతో సభ నుంచి నిష్కృమిస్తున్నానని తెలిపారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)