Breaking News

ఆపరేషన్‌ మేఘ్‌చక్ర: సీబీ‘ఐ’ మెరుపు దాడులు

Published on Sat, 09/24/2022 - 13:22

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో పలు చోట్ల ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మెరుపు దాడులకు దిగింది. పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను గుర్తించేందుకు, ఆ కంటెంట్‌తో మైనర్లపై బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్న ముఠాల పని పట్టేందుకు ఆపరేషన్‌ ‘మేఘ్‌చక్ర’ను నిర్వహిస్తోంది. ఈ మేరకు శనివారం దేశవ్యాప్తంగా సోదాలు మొదలుపెట్టింది.

మొత్తం పంతొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి దాదాపు 56 చోట్ల సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ దాడులు కొనసాగుతున్నాయి. మైనర్లపై లైంగిక వేధింపుల మెటీరియల్‌కు సంబంధించిన సమాచారం అందిన నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకుంది.. ఇతరత్ర పరిణామాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సింగపూర్‌ ఇంటర్‌పోల్‌ విభాగం నుంచి అందిన పక్కాసమాచారం మేరకే ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది సీబీఐ. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌ను పంపిణీ చేయడం, వాటి ఆసరాగా మైనర్‌లను బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తులను, ముఠాలను గుర్తించడం.. చర్యలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది సీబీ‘ఐ’.

పిల్లల అశ్లీల విషయాలను ప్రసారం చేయడానికి ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని నిరుడు సీబీఐ చేపట్టిన ‘ఆపరేషన్ కార్బన్’కు మేఘ్‌చక్ర కొనసాగింపు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని గత వారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కూడా.

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. గోడ కూలి 10 మంది దుర్మరణం!

Videos

గిరిజనుల రక్తం తాగుతున్న జనసేన ఎమ్మెల్యే

రోహిత్‌ను నిండా ముంచిన గిల్

సుడిగుండంలో కొట్టుకుపోతారు కూటమికి CPI రామకృష్ణ మాస్ వార్నింగ్

జగన్ ను దెబ్బ తీయాలనే బాబు చిల్లర రాజకీయాలు

భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం

Low Class Politics: దావోస్ లో ఇమేజ్ డ్యామేజ్

బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం

పాలసీల ముసుగులో స్కాములు.. స్కీములు

హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

Sailajanath: లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే

Photos

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)