Breaking News

కర్రెగుట్టలపై సాయుధ బలగాలు.. మావోయిస్టులు ఎక్కడ?

Published on Thu, 05/01/2025 - 19:16

ములుగు, సాక్షి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రె గుట్టలను భద్రతా బలగాలు పూర్తిగా స్వాధీనపర్చుకున్నాయి. మావోయిస్టుల కోసం అన్నివైపులా నుంచి గాలింపు కొనసాగిస్తున్నాయి. వేల సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో.. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా పది రోజులుగా సాయుధ బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 

కర్రెగుట్టలలో 20వేల మంది సాయుధ బలగాలు అన్ని వైపుల నుంచి భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో కర్రెగుట్టలో పై భాగంలో బేస్ క్యాంపు ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్యాంప్‌లో 10 వేల మంది సిబ్బంది భాగం అవుతారని సమాచారం. ఇప్పటికే ఈ క్యాంపు సమీపంలో భారీ సెల్‌ టవర్స్‌ నెలకొల్పారు. అలాగే.. బేస్ క్యాంపు వద్దకు డాగ్ స్క్వాడ్, మైన్ ప్రూఫ్ చేరుకోగా.. భారీగా ఆయుధాలలను తరలించారు. 

కర్రేగుట్టలోని దోబి కొండ నీలం సారాయి కొండలను పూర్తిగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ పది రోజుల్లో మావోయిస్టుల జాడ లభ్యం కాకపోవడం గమనార్హం. ఒకవైపు కర్రెగుట్టని మావోయిస్టులు ఖాళీ చేసి సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయి ఉంటారని ఏజెన్సీలో ప్రచారం భారీ ఎత్తున జరుగుతోంది. మరోవైపు భద్రతా బలగాలు మాత్రం మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను బలగాలు గుర్తించాయి. దీంతో భూగర్భంలో రహస్య స్థావరాలలో దాక్కుని ఉంటారని భావిస్తున్నాయి. అందుకు నిటారుగా ఉన్న కర్రెగుట్టలే కారణమని చెబుతున్నాయి. ఈ క్రమంలో.. మావోయిస్టులు స్థావరాల నుండి బయటకి వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తున్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)