Breaking News

‘బ్లూ స్టార్’కు ఇందిర మూల్యం చెల్లించారు’: చిదంబరం

Published on Sun, 10/12/2025 - 12:31

న్యూఢిల్లీ: ‘నాడు ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ చేపట్టాలనేది సమిష్టి నిర్ణయం అని, దీనిలో సైన్యం, పోలీసులు, నిఘా, పౌర సేవా రంగాలు పాల్గొన్నాయని, ఈ విషయంలో ఇందిరా గాంధీని మాత్రమే నిందించలేమని’ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం అన్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కసౌలిలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం 1984 నాటి ‘ఆపరేషన్ బ్లూ స్టార్‌’ను ప్రస్తావించారు. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని తిరిగి దక్కించుకునేందుకు అనుసరించిన తప్పుడు మార్గంగా ‘ఆపరేషన్ బ్లూ స్టార్‌’ను ఆయన అభివర్ణించారు. అయితే నాటి సమిష్టి నిర్ణయానికి ప్రధాని ఇందిరా గాంధీ అంతిమ మూల్యం చెల్లించారని చిదంబరం పేర్కొన్నారు.

1984, జూన్‌లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో చొరబడిన ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు ఉద్దేశించిన ఆర్మీ ఆపరేషన్ గురించి చిదంబరం మాట్లాడుతూ నాటి నిర్ణయం ఇందిరా గాంధీ ఒక్కరే తీసుకోలేదని స్పష్టం చేశారు. అది సమిష్టి నిర్ణయం అని, ఇందిగా గాంధీని మాత్రమే నిందించలేమని అన్నారు. అనంతరం పంజాబ్‌ గురించి మాట్లాడిన ఆయన ఖలిస్తాన్ ఉద్యమాలు చాలావరకు తగ్గిపోయాయని, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులే ఆ రాష్ట్రానికి ప్రధాన సమస్యగా మారాయని అభిప్రాయపడ్డారు.

ఆపరేషన్ బ్లూ స్టార్
ఆపరేషన్ బ్లూ స్టార్ 1994, జూన్ ఒకటి నుండి జూన్ ఎనిమిది వరకు జరిగింది. అకల్ తఖ్త్, స్వర్ణ దేవాలయ సముదాయంలోకి చొరబడిన  భింద్రాన్‌వాలే, అతని అనుచరులను తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఆర్మీ ఆపరేషన్ ప్రారంభించింది. దీనిలో ట్యాంకులు, భారీ ఫిరంగిదళాలు పాల్గొన్నాయి. ఫలితంగా ఉగ్రవాదులు, సైనికులు, పౌరులు  మరణించారు. ఈ దాడి సిక్కు సమాజాన్ని తీవ్రంగా బాధించింది. వారిలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. 1984 అక్టోబర్ 31న, స్వర్ణ దేవాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హత్య చేశారు. అనంతరం భారతదేశం అంతటా సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)