Breaking News

10లో నలుగురే!

Published on Sun, 08/10/2025 - 05:09

మనదేశం మొత్తం జనాభాలో 15–29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత సుమారు 29% ఉన్నారు. అంటే దాదాపు 42 కోట్ల మంది! యువత జనాభా పరంగా భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరించింది. ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని నడిపించే సామర్థ్యం వీరికి ఉంది. ఇదంతా నాణేనికి ఒకవైపు. వాస్తవానికి మన దేశంలోని యువతలో ఆర్జించే వారి సంఖ్య 40 శాతం లోపే ఉంది. అంతేకాదు, ప్రతి పది మందిలో ఒకరే ఉద్యోగం చేస్తున్నారు. 

పీపుల్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇండియాస్‌ కన్జ్యూమర్‌ ఎకానమీ (పీఆర్‌ఐసీఈ) విడుదల చేసిన ‘నావిగేటింగ్‌ ది యూత్‌ ఫ్రాంటియర్‌’ అనే పరిశోధనా పత్రంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదుగురు యువకుల్లో ఒకరు భారత్‌కు చెందిన వారు ఉంటారని ఈ అధ్యయనం తెలిపింది. 

2024–25లో మొత్తం యువతలో 2.4 శాతం అంటే.. ఒక కోటి మంది మాత్రమే వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని వివరించింది. ‘యువతలో అత్యధికంగా 26.8 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. వ్యాపారం, స్వయం ఉపాధి 14.1 శాతం; వేతన జీవులు 9.9 శాతం, రోజువారీ కూలీలు 12.3 శాతం ఉన్నారు’ అని వెల్లడించింది. 

నాలుగింట మూడొంతులు ప్రైవేట్‌ జాబ్స్‌
మూడింట ఒక వంతు..: సంపాదించే యువతలో మూడింట ఒక వంతు.. అంటే 34.2 శాతం మంది ఆదాయం నెలకు రూ.10,000 లోపే ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇక 69.3 శాతం మంది ఆదాయం నెలకు రూ.25,000 లోపే ఉంది. దిగువ, దిగువ మధ్య ఆదాయ విభాగంలో ఎక్కువ మంది స్త్రీలు ఉండగా; ఎగువ మధ్య, అధిక ఆదాయ విభాగంలో పురుషులు అధికంగా ఉన్నారు. ప్రైవేటు రంగంలో ఏకంగా 3 కోట్లపైచిలుకు మంది విధులు నిర్వర్తిస్తున్నారు.

గ్రామాల్లోనే ఎక్కువ..: యువతలో 70 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు, 90 శాతం మంది వ్యవసాయదారులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నిరుద్యోగుల్లో 68 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. మెట్రో నగరాల్లోని యువతలో అత్యధికంగా 22 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే వ్యవసాయేతర కార్యకలాపాలలో 17 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. సాంకేతికత, కళలు, సంస్కృతి పరంగా ప్రత్యేకత ఉన్న నగరాల్లో 19 శాతం, ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందుతున్న పట్టణాల్లో 16 శాతం యువత స్వయం ఉపాధి పొందుతున్నారు.

2024–25లో భారతీయ యువత ఆదాయాలు ఇలా..


సగటు ఆదాయం రూ.1,59,000
మొత్తంగా భారత్‌లోని యువతలో 38.7 శాతం మంది మాత్రమే సంపాదనపరులు ఉన్నారు. యూత్‌ సగటు ఆదాయం దేశంలో రూ.1,59,000 మాత్రమే. ఇది  పట్టణాల్లో రూ.2,19,000 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,28,000.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)