Breaking News

అందుకు వెనుకాడుతున్న సహజీవన జంటలు..!

Published on Wed, 02/05/2025 - 16:56

డెహ్రాడూన్‌:ఉత్తరాఖండ్‌లో యూనిఫామ్‌ సివిల్‌కోడ్‌(యూసీసీ) జనవరి 27న అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా అన్ని మతాల్లోని వ్యక్తులకు వివాహం,ఆస్తిహక్కులు తదితర అంశాల్లో ఒకే రకమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏ మతంలోనూ బహుభార్యత్వాన్ని యూసీసీ అనుమతించదు. వీటికితోడు యూసీసీ కింద సహజీవనాలను సైతం రిజిస్టర్‌​ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఎవరైనా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే జంటలు దరఖాస్తు చేసుకుని తమ సహజీవనాన్ని నమోదు చేసుకోవాలి. అయితే సహజీవనాల నమోదుకు ఇప్పటివరకు 5 దరఖాస్తులు రాగా కేవలం ఒక సహజీవనం మాత్రమే రిజిస్టర్‌ అయింది. అయితే సహజీవనాల నమోదుకు పెద్దగా స్పందన లేదన్న వాదన కొంత మంది వినిపిస్తున్నారు. 

దీనిని మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. చట్టంపై  ప్రజల్లో అవగాహన రావడానికి సమయం పడుతుందంటున్నారు. సహజీవనాల నమోదుకు చాలా మంది ఇష్టపడడం లేదన్న వాదనా ఉంది. అయితే సహజీవనం నమోదు చేసుకోకపోతే యూసీసీ కింద జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సహజీవనాల నమోదును చాలా మంది వ్యతిరేకించినప్పటికీ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. శ్రద్దావాకర్‌ తరహా ఘటనలు పునరావృతం కావద్దంటే సహజీవనాల నమోదు తప్పనిసరన్న నిబంధనను తీసుకువచ్చింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)