Breaking News

మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు

Published on Sun, 03/09/2025 - 06:02

ఇంఫాల్‌: మణిపూర్‌ వ్యాప్తంగా శనివారం నుంచి అన్ని రకాల వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇచ్చిన ఆదేశాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. భద్రతా సిబ్బంది, కుకీ వర్గం ప్రజల మధ్య జరిగిన ఘర్షణల్లో నిరసనకారుడొకరు చనిపోగా 40 మంది గాయపడ్డారు. వీరిలో 16 మంది స్థానికులు కాగా, 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాలను నిరసిస్తూ కంగ్‌పోక్పి వద్ద రెండో నంబర్‌ ఇంఫాల్‌–దిమాపూర్‌ జాతీయ రహదారిపై కుకీలు నిరసన చేపట్టారు. 

అడ్డుకునేందుకు యతి్నంచిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. అదే సమయంలో ప్రైవేట్‌ వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు. ఇంఫాల్‌ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయతి్నంచడంతో పరిస్థితి చేయి దాటింది. దీంతో, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఘర్షణల్లో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 

అయితే, మైతేయి వర్గం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు కాంగ్‌పోక్పికి రాకమునుపే అడ్డుకున్నారు. ర్యాలీ ముందుకు సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలని వారికి షరతు విధించారు. చివరికి వారందరినీ 10 ప్రభుత్వ బస్సుల్లో తరలిస్తుండగా కుకీల మెజారిటీ ప్రాంతమైన కాంగ్‌పోక్పి వద్ద అడ్డుకుని, ఒక బస్సుకు నిప్పంటించేందుకు ప్రయతి్నంచారని పోలీసులు తెలిపారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి, నిరసన కారులను చెదరగొట్టాక మైతేయి శాంతి ర్యాలీ నిర్వాహకులున్న బస్సులు ముందుకు సాగాయని చెప్పారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచి్చందని చెప్పారు.  

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)