కోవాగ్జిన్‌ సింగిల్‌ డోస్‌?!: ఐసీఎంఆర్

Published on Sun, 08/29/2021 - 08:00

న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సోకి తగ్గిన వ్యక్తిలో కోవాగ్జిన్‌ సింగిల్‌ డోస్‌తో యాంటీబాడీ స్పందన(రెస్పాన్స్‌) కనిపిస్తుందని ఐసీఎంఆర్‌ అధ్యయనం వెల్లడించింది. ఈ రెస్పాన్స్‌ ఒక్కసారి కూడా వ్యాధి సోకని, టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో వచ్చే యాంటీబాడీ రెస్పాన్స్‌కు సమానంగా ఉంటుందని అధ్యయనం తెలిపింది. 

అధ్యయన వివరాలను ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో ప్రచురించారు. పరిశీలించిన అంశాలను బట్టి ఇప్పటికే కరోనా సోకి తగ్గిన వారికి బీబీవీ152(కోవాగ్జిన్‌)సింగిల్‌డోస్‌ టీకా సరిపోతుందని భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. తాజా అధ్యయనంలో భాగంగా హెల్త్‌కేర్‌ వర్కర్లనుంచి కొందరిని ఎంపిక చేసుకొని వారిలో డే జీరో(టీకా ఇచ్చే రోజు), 28 వరోజు, 56వరోజు యాంటీబాడీ రెస్పాన్స్‌ను నమోదు చేశారు. 

అంతకుముందు కోవిడ్‌ లేని వ్యక్తుల్లో టీకా వల్ల వచ్చిన యాంటీబాడీ స్పందనను, కోవిడ్‌ సోకి తగ్గిన అనంతరం సింగిల్‌ డోస్‌ తీసుకున్నవారిలో వచ్చిన యాంటీబాడీ స్పందనను మదింపు చేశారు. రెండు కేసుల్లో యాంటీబాడీ రెస్పాన్స్‌ దాదాపు సమానంగా ఉన్నట్లు గమనించారు.  

చదవండి: రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ