Breaking News

మరో చీతా కన్నుమూత! జతకట్టే సమయంలో గాయపడటంతో..

Published on Tue, 05/09/2023 - 18:46

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో దక్ష అనే మరో ఆడ చీతా కన్నుమూసింది. మరో రెండు మగ చీతాలతో జతకట్టిన సమయంలో గాయపడటంతో.. కొద్దిగంటల్లోనే దక్ష మృతి చెందిందని, ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ జేఎస్‌ చౌహాన్‌ అన్నారు. తాము ఆ ఆడ చీతాకు అవసరమైన అన్ని మందులు, చికిత్స తక్షణమే అందించామని, కానీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణాలు విడిచిందని తెలిపారు. వాయు, అగ్ని అనే మగ చీతాలతో సంభోగ సమయంలో అవి పరస్పరం హింసాత్మక దాడులు చేసుకున్నాయని, అందువల్లే దక్ష అనే చీతా మరణించిందని చౌహాన్‌ పేర్కొన్నారు.

ఎన్‌క్లోజర్‌ నెంబర్‌ 1లో ఉన్న దక్షను బోమా 7 ఎన్‌క్లోజర్‌లో ఉన్న  వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలతో సంభోగం కోసం విడుదల చేశారు. అయితే ఈ ప్రక్రియలో మగ చిరుతలు హింసాత్మకంగా మారినట్లు కనిపిస్తోంది. కానీ ఇది చాలా సర్వ సాధారణ విషయమని చౌహాన్‌ చెబుతున్నారు. మగ చిరుతలు జత కట్టే సమయంలో తమకు సంబంధంలేని మగ చిరుతలతో దాడులకు దిగుతాయని, గెలిచిన మగ చిరుత ఆడ చిరుతతో జత కడుతుందని తెలిపారు.

ఇదిలా ఉండగా, గతేడాది ప్రాజెక్టు చీతా కింద దక్షిణాఫ్రికా నుంచి దాదాపు ఇరువై చీతాలను జాతీయ పార్కుకి తీసుకురాగా వాటిలో సాషా, ఉదయ్‌ అనే రెండు చిరుతలు మార్చి, ఏప్రిల్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఆ రెండు చిరుతలను సెప్టంబర్‌ 2022లో వేర్వేరు బ్యాచ్‌లలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తరలించారు.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్ 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో వద్ద ఉన్న క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి నమీబియా నుంచి ఐదు ఆడ చీతా పిల్లలు, మూడు మగ చీతా పిల్లలతో కూడిన ఎనిమిది చీతా పిల్లలను విడుదల చేశారు.
(చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రధాని మోదీ బహిరంగ లేఖ! ఆ లేఖలో ఏముందంటే..)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)