Breaking News

గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!

Published on Wed, 05/15/2024 - 06:42

రాజస్థాన్‌లోని నీమ్ కా థానా జిల్లాలో మంగళవారం రాత్రి  హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ప్రమాదం సంభవించింది. సంస్థకు  చెందిన 14 మంది అధికారులు, విజిలెన్స్ బృందం సభ్యులు గనిలో చిక్కుకున్నారు.

ఉద్యోగులను గని లోపలికి, బయటికి తరలించేందుకు ఉపయోగించే వర్టికల్ షాఫ్ట్ పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోలిహన్ గని వద్ద విజిలెన్స్ బృందం కంపెనీ సీనియర్ అధికారులతో కలిసి తనిఖీలు చేసేందుకు వందల మీటర్ల మేర గనిలోకి దిగింది. వారు పైకి వస్తున్న సమయంలో షాఫ్ట్ (కేజ్) వైర్‌ తెగిపోయింది. దీంతో గని లోపల తనిఖీ చేయడానికి వెళ్లిన 14 మంది అధికారులు లోపలే చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే ఖేత్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ధరంపాల్ గుర్జార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో పలువురు అధికారులతో పాటు ఏడు అంబులెన్స్‌లు ఉన్నాయి. అధికారులను బయటకు తీసుకువచ్చే పనిలో రెస్క్యూ టీమ్ నిమగ్నమైంది. ప్రస్తుతానికి ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)