Breaking News

ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం

Published on Fri, 06/23/2023 - 12:53

భువనేశ్వర్‌: ఇటీవలే ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బహనాగ వద్ద మూడు రైళ్లు ఒక్కదానినొకిటి ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో​ వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై కుట్ర కోణంలో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన మూడు వారాల తర్వాత అధికారులపై రైల్వే బోర్డు చర్యలకు తీసుకుంది. ఈ నేపథ్యంలో సౌత్‌ ఈస్టర్‌ రైల్వేస్‌కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులపై బోర్డు వేటు వేసింది. సిగ్నలింగ్‌, ఆపరేషన్స్‌, సేఫ్టీ విభాగాలను చూసే ఈ అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ఇక, వేటు పడిన వారిలో  ఖరగ్‌పూర్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ శుజాత్‌ హష్మీ, ఎస్‌ఈఆర్‌ జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్‌ పీఎం సిక్దర్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ చందన్‌ అధికారి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ డీబీ కేసర్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎండీ ఓవైసీ ఉన్నారు. అయితే, ఇది సాధారణ బదిలీల్లో భాగమేనని అధికారులు వెల్లడించారు.

జేఈ ఇంటి సీల్‌ వేసిన సీబీఐ
మరోవైపు.. ఒడిషా రైలు ప్రమాదం తర్వాత భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్‌ జూనియర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్‌ ఖాన్‌, అతని కుటుంబం కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి తాళం ఉన్నది గమనించక.. సీల్‌ వేసి మరీ వెళ్లడం గమనార్హం.  ఆపై సోరోలోని తెంటెయ్‌ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్‌ మాస్టర్‌ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది. 

అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్‌ జేఈ అయిన అమీర్‌ ఖాన్‌ బాలాసోర్‌ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తు‍న్నాడు.  జూన్‌ 2వ తేదీ రాత్రి బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్‌ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు.

ఇది కూడా చదవండి: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్‌ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)