Breaking News

'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో కన్నీటి గాథలెన్నో..

Published on Sat, 06/03/2023 - 17:07

ఒడిశా:ఒడిశాలోని బాలాసోర్‌లో జ‌రిగిన భీక‌ర రైళ్ల ప్ర‌మాదంలో ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. అయినవారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఆ మృతదేహాల ముందే విలపిస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్నవారికి ఈ ఘటనను ఎలా తెలపాలో తెలియని దయనీయ స్థితిలో మరెందరో ఉన్నారు. తన చేతులతోనే కన్న కొడుకు మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లానని చెప‍్తూ ఓ తండ్రి కన‍్నీటి పర్యంతమయ్యారు. 

సుగాలి చెన్నైలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు.  ఈ రైలు ప్రమాదంలో సుగాలి పెద్ద కుమారుడు సుందర్‍తో పాటు బామ్మర్ధి దిలీప్ కూడా మరణించాడు. తన చిన్న కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 'మేమంతా తొమ్మిది మందిమి చెన్నైకి బయలుదేరాము. డబుల్ డ్యూటీ చేస్తేనే నెలకు 17,000 సంపాదిస్తాను. ఊర్లో ఉపాది లేక నా కుమారులను కూడా ఏదైనా ఉద్యోగం చేపించాలని చెన్నైకి తీసుకువస్తున‍్నాను. కానీ మృత్యువు ప్రమాదం రూపంలో ఎదురైంది. నా కొడుకు మృతదేహాన్ని నా చేతులతోనే మోయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో బాధితులు కుప్పలుగా పడి ఉన్నారు.' అని సుగాలి కన్నీటి పర్యంతమయ్యారు. 

ఇదీ చదవండి:Odisha Train Accident: నిమిషాల వ్యవధిలోనే.. మూడు రైళ్లు..

తపసి సర‍్ధార్(22) హౌరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో వ్యవసాయ కూలీగా ఏడు నెలలు పని చేసి ఇంటికి వెళుతున్న 11 మంది సభ్యుల్లో ఒకరు. ' అంతా గందరగోళం. అరుపులు, ఏడుపులు వినిపించాయి. నా తలకు ముఖంపై గాయాలయ్యాయి. ఇంకా నాలుగు గంటలైతే మా స్టాప్ వచ్చేది. అమ్మను కలిసేవాడిని.' అని విలపించాడు. 

గోపాల్ మిర్దా(40), అతని భార్య అంజు దేవి జార్ఖండ్ గడ్డా జిల్లాకు చెందినవారు. బెంగళూరులోని నర్సరీలో రెండు నెలలు పని చేసి ఇంటికి వెళుతున్నారు. ' నా కొడుకుని మా అమ్మే చూసుకుంటుంది. ఇటీవల ఆవిడ ఆరోగ్యం బాగుండట్లేదు. అందుకే ఇంటికి వెళ్లి వారిని చూసుకుందామనుకున్నాం. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. కాలుకు తలకు గాయాలయ్యాయి.' అని దుఖంతో చెప్పారు. 

ఒడిశాలోని బాలాసోర్‌లో జ‌రిగిన భీక‌ర రైళ్ల ప్ర‌మాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు.

ఇదీ చదవండి:Odisha Train Accident: ఈ పాపం ఎవరిది?..ఇది సాంకేతిక సమస్య లేదా మానవ లోపమా?..

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)