Breaking News

Odisha: గుంజీలు తీస్తూ విద్యార్థి మృతి

Published on Thu, 11/23/2023 - 06:16

జాజ్‌పూర్‌(ఒడిశా): బడి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్‌ వేసిన శిక్ష ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగో తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ కుప్పకూలి ఆస్పత్రిలో కన్నుమూసిన విషాధ ఘటన ఒరాలీ గ్రామం దగ్గర్లోని సూర్యనారాయణ్‌ నోడల్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో జరిగింది. రసూల్‌పూర్‌ బ్లాక్‌ విద్యాధికారి(బీఈఓ) నీలాంబర్‌ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పదేళ్ల పిల్లాడు రుద్ర నారాయణ్‌ సేథీ బడి ప్రాంగణంలో మధ్యాహ్నం పూట మూడు గంటలకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నాడు.

అది క్లాసులు జరిగే సమయం కావడంతో ‘‘క్లాస్‌ వదిలేసి ఏంటీ ఆటలు?’’ అంటూ కోప్పడి అక్కడి టీచర్‌.. సేథీసహా ఐదుగురిని గుంజీలు తీయండని ఆదేశించారు. దీంతో గుంజీలు తీస్తూ సేథీ కొద్దిసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి, మెరుగైన వైద్యం కోసం కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ‘  చిన్నారి మరణానికి వీళ్లే కారకులు అంటూ ఎవ్వరూ మాకు ఫిర్యాదు చేయలేదు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఈఓ నీలాంబర్‌ స్పష్టం చేశారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)