జేఈఈ–మెయిన్‌ ఫైనల్‌ కీ  కోసం వేచి ఉండండి: ఎన్‌టీఏ

Published on Thu, 04/17/2025 - 05:53

న్యూఢిల్లీ: జేఈఈ–మెయిన్‌ ఆన్సర్‌ ఫైనల్‌ కీని విడుదల చేసే వరకు వేచిచూడాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) బుధవారం ఇంజనీరింగ్‌ విద్యార్థులను కోరింది. ప్రొవిజినల్‌ కీలో ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటివరకు ఎటువంటి నిర్ణయానికి రావొద్దని సూచించింది. జేఈఈ–మెయిన్‌ ప్రొవిజినల్‌ కీలో ఇచ్చిన సమాధానాల్లో పలు తప్పులు దొర్లాయంటూ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్న ఈ మేరకు ఎన్‌టీఏ స్పష్టతనిచ్చింది. ‘పరీక్షా విధానంలో ఎన్‌టీఏ పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. 

ఇందులో భాగంగానే ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీని విడుదల చేసింది. దీనిపై వచ్చిన అన్ని రకాల సందేహాలను పరిగణనలోకి తీసుకుంటుంది. విద్యార్థుల ఆందోళనలను, సందేహాలను నివృత్తి చేస్తుంది. అందరికీ న్యాయం దక్కేందుకు తగు చర్యలు తీసుకుంటుంది. ఫైనల్‌ ఆన్సర్‌ కీని ఇంకా వెల్లడించలేదు. ఫైనల్‌ ఆన్సర్‌ కీ ఆధారంగా మాత్రమే స్కోర్‌ నిర్ణయమవుతుంది. ప్రొవిజినల్‌ కీ ఆధారంగా ఆన్సర్లపై ఎటువంటి నిర్ణయానికి రావద్దని ఎన్‌టీఏ సూచిస్తోంది. అనవసరమైన సందేహాలకు, ఆందోళనలకు కారణమయ్యే వార్తలను నమ్మవద్దని విద్యార్థులను కోరుతోంది’అని పేర్కొంది. కాగా, జేఈఈ–మెయిన్‌ రెండు దశల్లో జనవరి, ఏప్రిల్‌లలో ఎన్‌టీఏ నిర్వహించింది. 
 

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)