యూట్యూబ్‌ కింగ్‌ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చేశాడు!

Published on Thu, 10/19/2023 - 16:31

YouTuber Gaurav Taneja  మలేషియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థకు మాజీ పైలట్‌  గౌరవ్ తనేజా మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా?  యూట్యూబ్‌లో ఫ్లైయింగ్‌ బీస్ట్‌గా ఫిట్‌నెస్‌ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్  తన సంపాదన ఎంతో ఫ్యాన్స్‌కి చెప్పేశాడు.  అంతేకాదు  తన పాత సీఈవోతోపోలిస్తే సంపాదనలో   కింగ్‌ని  అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఒకపుడు తనను తొలగించిన ఏయిర్‌ ఏసియా సీఈవో కంటే ఇపుడు తన సంపాదేన ఎక్కువ అంటూ ఇటీవల ఇన్‌ఫ్లుయెన్సర్ రాజ్ షమానీ హోస్ట్ చేసిన పోడ్‌కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ డీల్స్, యాడ్స్‌ ఆదాయం గురించి చెప్పమని అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశాడు.  గౌరవ్‌ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. నిర్దిష్టంగా ఇంత అనీ సంపాదన వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఎయిర్‌ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ మిలియన్‌ డాలర్ల ఆస్తులను గుర్తుచేసుకుని తనేజా ఫ్యాన్స్‌ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అదీ  సీఈవో టోనీ లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌తో విమర్శల పాలైన తరువాత  కంపెనీ మాజీ పైలట్‌ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మరింత వైరల్‌గా మారాయి.

ఇంతకీ ఎవరీ  గౌరవ్‌ తనేజా
♦ 2008లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ పట్టభద్రుడైన గౌరవ్ తనేజా "సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ప్రొఫెషనల్ బాడీబిల్డర్ ,  ఏవియేటర్ కూడా.
♦ ఇపుడు ఢిల్లీ  యూనివర్శిటీనుంచి ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాడు.
♦ మరో పైలట్‌ రీతూ రథీతో వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు .
♦ భద్రతా సమస్యల్ని గురించిన మాట్లాడినందుకే తనను  ఎయిర్‌ ఏసియానుంచి తొలగించారనేది  గౌరవ్‌ వాదన. 
♦ ఫ్లైయింగ్ బీస్ట్ కంటే ముందే  2016లో FitMuscle TVని లాంచ్‌ చేశాడు. దీనికి దాదాపు 30 లక్షల సబ్‌ స్క్రైబర్లున్నారు. ఇక 2020లో లాంచ్‌ చేసిన రాస్బరీ కే పాపాకి 12 లక్షలకు పైగా సబ్‌ స్క్రైబర్లున్నారు

కాగా 2020జూన్‌లో AirAsia ఇండియా గౌరవ్‌ను పైలట్‌గా  విధులనుంచి  తొలగించింది. అప్పటికే ప్రముఖ వ్లాగర్‌గా తనేజా ఫుట్‌ టైం కంటెంట్‌ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా కరియర్‌ స్టార్ట్‌ చేశాడు.ఫ్లైయింగ్ బీస్ట్‌, ఫిట్ మజిల్ టీవీ, రాస్బరీకే పాపా పేర్లతో యూట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నాడు. అలా సోషల్‌మీడియాలో పాపులర్‌ స్టార్‌గా మారిపోయాడు.ప్రస్తుతం, యూట్యూబ్‌లో 80 లక్షలకుపైగా  సబ్‌స్క్రైబర్లు, ట్విటర్‌లో  దాదాపు 900k, ఇన్‌స్టాలో  40 లక్షల   ఫాలోవర్స్‌   ఉన్నారంటే అతని క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)