Breaking News

త్వరలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

Published on Sun, 11/03/2024 - 08:05

జేవార్‌: ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. నవంబర్ 15న తొలిసారిగా ఈ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కానుంది. రెండవ దశ ట్రయల్ ఆపరేషన్‌లో భాగంగా విమానం నవంబర్ 15న ఇక్కడ ల్యాండ్ కానుంది. డిసెంబర్ 15 వరకు ట్రయల్‌ రన్‌ కొనసాగనుంది. ఈ విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి సాధారణ ప్రయాణికులకు  అందుబాటులోకి రానుంది.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ వీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ట్రయల్ రన్‌ రెండవ దశలో అకాసా, ఇండిగో,  ఎయిర్ ఇండియా విమానాలు ప్రతిరోజూ  ఇక్కడ రాకపోకలు సాగిస్తాయన్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగే ఈ ట్రయల్‌లో ప్రతిరోజూ ఇక్కడి నుంచే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరుగుతాయన్నారు.

డిసెంబరు 20 నాటికి ట్రయల్‌ రన్‌ డేటాను డీజీఈసీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. దీని తర్వాత  ఎయిర్‌డోమ్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేయనున్నారు. మార్చి 20 నాటికి లైసెన్స్ వస్తుందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ భావిస్తోంది. 2025 ఏప్రిల్ 17 నుంచి జేవార్ విమానాశ్రయంలో వాణిజ్య విమానాలు  రాకపోకలు కొనసాగనున్నాయి. మొదటి రోజు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఇందులో జ్యూరిచ్, సింగపూర్, దుబాయ్ నుండి మూడు అంతర్జాతీయ విమానాలు సహా  రెండు కార్గో విమానాలు కూడా ఉన్నాయి.

ముందుగా 30 విమానాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 25 దేశీయ, మూడు అంతర్జాతీయ, రెండు కార్గో విమానాలు ఉన్నాయని అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రన్‌వే, గాలి ప్రవాహం, మొదటి దశ ట్రయల్స్‌ను పరిశీలించిన తర్వాత దీనికి ఆమోదం తెలిపింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం లక్నో, ముంబై, బెంగళూరు, హైదరాబాద్,  డెహ్రాడూన్‌తో సహా పలు పెద్ద నగరాలకు తొలుత కనెక్ట్‌ కానుంది.

ఇది కూడా చదవండి: మహాప్రాణులకు మళ్లీ జీవం!

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)