Breaking News

ఒత్తిడిలో ఉన్నారా...? ఉద్యోగం ఉఫ్‌

Published on Tue, 12/10/2024 - 06:32

సంస్థలో సరదాగా అంతర్గత సర్వే అంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా స్పందిస్తారు. సర్వేలో అడిగే ప్రశ్నలు వివాదాస్పదమైనవి కాకుండా సాధారణంగా ఉంటే ఏ ఉద్యోగి అయినా స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా సమాధానమిస్తారు. తమ అభిప్రాయాలను సంస్థ యాజమాన్యంతో పంచుకుంటారు. 

అలా ఉద్యోగులు చెప్పిన విషయాలే తమ ఉద్యోగం ఊడటానికి కారణమని సదలు ఉద్యోగులు తెల్సుకుని షాక్‌కు గురయ్యారు. ఉద్యోగుల్ని తొలగించే ఉద్దేశ్యం ఉంటే నేరుగా ఆ ఉద్యోగులకు చెప్పాలిగానీ ఇలా సర్వే వంకతో ఉద్యోగం నుంచి తొలగించడమేంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నోయిడా కేంద్రంగా పనిచేసే ఒక అంకుర సంస్థ చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.  

యస్‌ అని చెబుతున్నారా? 
పనివేళల్లో పని కారణంగా మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా? అంటూ ‘యస్‌మేడమ్‌’అనే అంకురసంస్థ తన ఉద్యోగులతో అంతర్గత ఈమెయిల్‌ సర్వే చేపట్టింది. ఈ సంస్థ ఇంటి వద్ద హెయిర్‌ కటింగ్, మసాజ్, ఇతరత్రా బ్యూటీ, వెల్‌నెస్‌ సేవలను అందిస్తోంది. ఈ సర్వేలో భాగంగా చాలా మంది ఉద్యోగులు తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేశారు. 

వీటిని సేకరించిన సంస్థ.. ఒత్తిడిగా ఫీల్‌ అవుతున్నాం అని సమాధానం చెప్పిన వారందరినీ తొలగిస్తున్నట్లు వాళ్లకు విడిగా ఈమెయిల్‌ సందేశాలు పంపింది. ఇతర ఉద్యోగులకు వివరణ సందేశాలు పంపింది. ‘‘ఒత్తిడి ఉందా అని మేం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి సర్వేలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ స్పందనకు మేం చాలా విలువ ఇస్తున్నాం. పనిచేసేటప్పుడు ఒక్కరు కూడా ఒత్తిడిగా ఫీల్‌ అవ్వకూడదు అనేది సంస్థ సిద్ధాంతం. 

ఈ మేరకు ఉద్యోగుల విషయంలో సంస్థ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తదుపరి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని కంపెనీ పేర్కొంది. కంపెనీ మానవవనరుల విభాగ సారథి అషు అరోరా ఝా పేరిట వచ్చిన ఈమెయిల్‌ సందేశాలను చూసి సదరు ఉద్యోగులు అవాక్కయ్యారు. ‘‘ఒత్తిడిగా ఉందని చెబితే పిలిచి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలిగానీ ఇలా ఏకంగా ఉద్యోగం ఊడపీకేస్తారా? అంటూ జాబ్‌ కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. 

సర్వేలో ‘యస్‌’అని చెప్పిన దాదాపు 100 మందిని సంస్థ తొలగించిందని తెలుస్తోంది. ఇండిగో డిజిటల్‌ మార్కెటింగ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ శితిజ్‌ డోగ్రా చేసిన ఒక పోస్ట్‌తో ఈ ‘ఉద్యోగుల ఉద్వాసన పర్వం’వెలుగులోకి వచ్చింది. ‘‘నిజాయతీగా సమాధానం చెబితే సంస్థ ఇలాంటి మతిలేని నిర్ణయం తీసుకుంటుందా?’’అని చాలా మంది నెటిజన్లు సంస్థ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ఆలిండియా ఎంప్లాయీ అసోసియేషన్‌ స్పందించింది. 

‘‘కార్మిక వ్యవస్థలోని లోపాలను కొన్ని సంస్థలు పూర్తిగా దురి్వనియోగం చేస్తున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్తోమత లేకపోతే ముందుగా అసలు ఉద్యోగాల్లోకి తీసుకోకండి. ఆరోగ్యకరమైన ఉద్యోగ వాతావరణాన్ని కల్పించలేకపోతే ఎవరికీ ఉద్యోగం ఇవ్వకండి. పిచ్చిపిచ్చి కారణాలు చెప్పి ఉద్యోగులను మానసికంగా వేధించకండి’’అని వ్యాఖ్యానించింది.

 ‘‘హేతుబద్దత లోపించిన అనైతిక నిర్ణయం ఇది. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు సంస్థలు ఇలాంటి చవకబారు నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పుడే చూస్తున్నాం. ఉద్యోగలు పనిసమయాల్లో ఒత్తిడిగా ఫీల్‌ అయ్యారోలేదో తెలీదుగానీ ఈ వార్త తెల్సి నిజంగా చాలా ఒత్తిడికి గురై ఉంటారు. ఇది అందరూ ఒత్తిడిగా ఫీల్‌ అయ్యే ఘటన’’అని పలువురు పెదవి విరిచారు.  
 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)