Breaking News

ధన్‌ఖడ్‌పై అభిశంసన నోటీసు తిరస్కరణ

Published on Thu, 12/19/2024 - 16:23

న్యూఢిల్లీ: అధికార పక్షం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌పై విపక్షాల కూటమి పార్టీలు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీసు గురువారం తిరస్కరణకు గురైంది. వాస్తవికత లోపించిందని, వ్యక్తిగత దాడిని ఈ నోటీసు ప్రతిబింబిస్తోందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ నోటీసు మొత్తం తప్పుల తడకగా ఉంది.

 ప్రామాణిక విధానంలో రూపొందించ లేదు. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రతిష్టను దురుద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా నోటీసును సిద్ధంచేశారు.  కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ప్రవేశపెట్టిన నోటీస్‌ ఇది’’ అంటూ హరివంశ్‌ ఈ నోటీసును తిరస్కరించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్‌ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధిత వివరాలున్న మూడు పేజీల రూలింగ్‌ను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోడీ గురువారం సభ ముందు ఉంచారు. 

పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ధన్‌ఖడ్‌పై తాము విశ్వాసం కోల్పోయామని, ఆయనను ఆ పదవిని తప్పించాలని కోరుతూ 60 మంది విపక్ష పార్టీల ఎంపీలు డిసెంబర్‌ పదో తేదీన సంతకాలుచేసి ఆ అభిశంసన తీర్మాన నోటీసును రాజ్యసభలో అందించిన విషయం విదితమే. ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు వీలు కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 67(బీ) కింద విపక్షాలు ఈ నోటీసును ఇచ్చాయి.

 ‘‘ నోటీస్‌ ద్వారా విపక్ష సభ్యులు ఉపరాష్ట్రపతి అధికారాలను తక్కువ చేసి చూపించే అనవసర సాహసం చేశారు. పార్లమెంట్, పార్లమెంట్‌ సభ్యుల ప్రతిష్టకు భంగం కల్గించేలా ఉన్న ఈ నోటీసు డిప్యూటీ ఛైర్మన్‌ అభిప్రాయాలను కించపరిచేలా ఉంది. అయినా ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు సంబంధించిన తీర్మానంపై ఓటింగ్‌ చేపట్టాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీస్‌ ఇవ్వాలి. 

డిసెంబర్‌ 10న సభ ముందుకొచ్చిన ఈ నోటీస్‌పై తీర్మానం, అనుమతి అనేవి నిబంధనల ప్రకారం డిసెంబర్‌ 24వ తేదీ తర్వాతే సాధ్యం. మంత్రిమండలి నవంబర్‌ ఆరో తేదీన నోటిఫై చేసిన ప్రకారం ప్రస్తుత రాజ్యసభ 266వ సెషన్‌ నవంబర్‌ 25న మొదలై డిసెంబర్‌ 20న ముగుస్తుంది. ఈ లెక్కన తీర్మానం తేదీ(డిసెంబర్‌ 24)కంటే ముందుగానే రాజ్యసభ సెషన్‌ ముగుస్తోంది. ఇలాంటి సందర్భంలో తీర్మానాన్ని ఆ తేదీలోపే అనుమతించడం కుదరదు’’ అని హరివంశ్‌ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)