Breaking News

అరవై దాటినా.. ఆగని అడుగులు

Published on Fri, 02/20/2026 - 04:52

సాధారణంగా అరవై ఏళ్లు దాటాయంటే జీవితం ముగిసిపోయిందని, ఇక విశ్రాంతి తీసుకోవడమే మిగిలిందని అనుకుంటాం. కానీ, భారతదేశంలో ఇప్పుడొక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. అదే.. ‘సిల్వర్‌ రివల్యూషన్‌’. వృద్ధులు పాత ఆలోచనలను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో మళ్లీ వ్యాపకాల్లో అడుగులు వేస్తున్నారు. తెల్లబడిన జుట్టు వెనుక ఉన్న అపారమైన అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడేలా తమ ‘రెండవ ఇన్నింగ్స్‌’ను ప్రారంభిస్తున్నారు.

ప్రధాన కారణాలు
మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, డిజిటల్‌ పరిజ్ఞానం, తమకంటూ ఒక గుర్తింపు ఉండాలనే తపన... ఈ మూడు ప్రధాన కారణాలు, అరవై దాటిన వారిని ఏదో ఒక పనిని చేపట్టేందుకు  ప్రేరణ కలిగిస్తున్నాయని ‘హెల్ప్‌ఏజ్‌ ఇండియా’ తాజా నివేదిక వెల్లడించింది.

అపోహలకు భిన్నంగా...!
యువతరంలో దాదాపు సగం మంది ఇప్పటికీ వృద్ధులను, ‘ఇతరులపై ఆధారపడేవారు’ గానే భావిస్తుండగా, అందుకు భిన్నంగా వృద్ధులు సమాజంలో చురుకైన పాత్ర పోషించటం విశేషమని నివేదిక పేర్కొంది. ‘‘ఇతరుల సహాయం తీసుకునే వ్యక్తులుగా ఉండాలని వారు అనుకోవడం లేదు. బదులుగా, సమాజానికి దిక్సూచిగా ఉండాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, కొత్త వృత్తులను ప్రారంభించాలని బలంగా కోరుకుంటున్నారు’’ అని తెలిపింది.

మరింత దృష్టి పెట్టాలి
‘పెద్దల’ అనుభవాన్ని, శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలంటే, మన వ్యవస్థల్లో మరింతగా మార్పులు జరగవలసిన అవసరం ఉందని ‘హెల్ప్‌ఏజ్‌ ఇండియా’ అధ్యయనం సూచించింది. ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరింది.

వృద్ధులకు వారి అనుభవానికి తగ్గట్టుగా కన్సల్టింగ్‌ లేదా మార్గదర్శకత్వ బాధ్యతలను అందించే అనుకూలమైన ఉద్యోగాలను కల్పించటం.
యువత, వృద్ధులు కలిసి తమ జ్ఞానాన్నిపంచుకునే వేదికలను ఏర్పాటు చేయటం.
నేటి ఆధునిక యుగంలో వృద్ధులు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండటానికి అవసరమైన డిజిటల్‌ పరిజ్ఞానాన్ని నేర్పించే ప్రోగ్రామ్‌లను రూపొందించటం.

యువతరం, అనుభవం కలిస్తే!
‘సిల్వర్‌ రివల్యూషన్‌’ అనేది కేవలం వృద్ధులకు సంబంధించినది మాత్రమే కాదు, ఇది పౌరులందరి బాధ్యత. వృద్ధులలోని అపారమైన జ్ఞానాన్ని గౌరవిస్తూ, వారికి అవసరమైన డిజిటల్‌ సహకారాన్ని అందిస్తే, ఆ అనుభవం సమాజానికి ఉపయోగపడుతుందని, యువతరం ఉత్సాహం,
వృద్ధుల అనుభవం కలిసినప్పుడే, మెరుగైన దేశాన్ని నిర్మించుకోగలమని ‘హెల్ప్‌ఏజ్‌ ఇండియా’ తెలిపింది.

వృద్ధులకు పని పథకాలు
అరవై దాటిన వారికి పని కల్పించటం కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే ‘సేక్రెడ్‌’ (సీనియర్‌ ఏబుల్‌ సిటిజెన్స్‌ ఫర్‌ రీ–ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్‌ డిగ్నీటీ), అటల్‌ వయో అభ్యుదయ్‌ యోజన (ఎ.వి.వై.ఎ.వై) తదితర పథకాలతో పాటుగా, ఎల్డర్‌లైన్‌ అనే హెల్ప్‌ లైన్‌ (14567)ను ప్రవేశపెట్టింది.

వృద్ధుల ‘అదృశ్య’ సేవలు
కుటుంబాలకు, సమాజానికి వృద్ధులు అందిస్తున్న సహకారం (అంకెలు శాతాల్లో)
సేవలు   -   భాగస్వామ్యం
సలహాలు, జీవితానుభవాలు  - 72 
పిల్లల సంరక్షణ  -  50
ఇంటి పనులు చక్కబెట్టటం - 47 
కుటుంబానికి డబ్బు సహాయం  - 36
మనో ధైర్యాన్ని ఇవ్వటం  - 31
సామాజిక కార్యక్రమాలు  - 19

వృద్ధులను యువత ఎలా చూస్తోంది? (అంకెలు శాతాల్లో)
అభిప్రాయం   -   అంగీకరించిన వారు 
గౌరవనీయులైన అనుభవజ్ఞులు  - 51
ఒకరిపై ఆధారపడేవారు  - 48 
నైతిక విలువలకు నిటువుటద్దం  -  43
కుటుంబానికి పెద్ద దిక్కు  - 36

పని గురించి ఏం అంటున్నారు? (అంకెలు శాతాల్లో)
వృద్ధుల మనోభావాలు  -  ఎంత?
పదవీ విరమణ తర్వాత కూడా పని చేయాలి   - 36
వీలైనంత కాలం పని చేస్తూనే ఉండాలి  - 40
తమ ప్రస్తుత సేవలకు గుర్తింపు ఉంది - 78    
ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తోంది  - 44
అప్పుడప్పుడు మాత్రమే గుర్తింపు ఉంటోంది -34

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)