Breaking News

‘భారత్‌ ఏం చేయాలో ఏ శక్తీ నిర్ణయించదు’: జగదీప్ ధన్కర్

Published on Sun, 07/20/2025 - 09:47

న్యూఢిల్లీ: ‘ఈ భూభాగంలోని ఏ శక్షి కూడా భారతదేశం తన వ్యవహారాలను ఎలా నిర్వహించాలో నిర్దేశించలేదని, బయటి కథనాల ద్వారా ఇక్కడి ప్రజలకు మార్గనిర్దేశం జరగదని’  ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్పష్టం చేశారు. వైస్ ప్రెసిడెంట్స్ ఎన్‌క్లేవ్‌లో ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (ఐడీఈఎస్‌) 2024 బ్యాచ్ ఆఫీసర్ ట్రైనీల సమావేశంలో పాల్గొన్న ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మనది ఒక దేశం. ఇతర దేశాల మధ్య నివసిస్తున్నాం. ఇవన్నీ ఒక సమాజంగా ఉంటాయి.  అందరం కలిసి పనిచేస్తాం. మన మధ్య పరస్పర గౌరవం, దౌత్య సంభాషణలు ఉంటాయి. అయినా చివరికి మనం సార్వభౌమాధికారం కలిగి ఉండి, స్వంత నిర్ణయాలు తీసుకుంటామని’ జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. కొంతకాలంగా భారత్‌- పాక్‌ వివాదంలో కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
 

భారత్‌- పాక్‌లకు తాను వాణిజ్య ఒప్పందాన్ని చూపించడం ద్వారా ఆ దేశాల మధ్య కాల్పుల విరమణ చేయగలిగానని ట్రంప్‌ పేర్కొన్నారు. దీనిని భారత్‌ ఖండించింది. మే 10న కాల్పులతో పాటు సైనిక చర్యలను నిలిపివేయడంపై  ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయని, ఇరు దేశాల డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నేరుగా ఒప్పందాన్ని ఖరారు చేశారని భారత్‌ తరచూ చెబుతూ వస్తోంది. తాజాగా ట్రంప్‌.. భారత్‌-పాక్‌ ఘర్షణల్లో ఐదు ఫైటర్ జెట్‌లు కూలిపోయినట్లు వ్యాఖ్యానించారు.ఈ వాదనకు ఎటువంటి ఆధారాలు లేవని భారత్‌ స్పష్టం చేసింది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)