Breaking News

వీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై అనర్హులు..! ప్రభుత్వం కీలక నిర్ణయం..

Published on Tue, 08/08/2023 - 21:23

జైపూర్‌: దేశంలో మహిళలపై అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన దారుణం యావత్ దేశాన్ని తలదించుకునేలా చేసింది. అటు.. రాజస్థాన్‌లోని బిల్వారాలో నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని కలచివేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉంటే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. 

మహిళలపై వేధింపులు, అత్యాచార, అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు ఉన్నా, హిస్టరీ షీట్స్ నమోదైనా.. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన లిస్ట్ ఇకపై పోలీసు స్టేషన్‌లలో ఉంటుందని చెప్పారు. ఇలాంటి నిందితుల ప్రవర్తన పత్రాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. 

ఇటీవల రాజస్థాన్‌లో మహిళలపై దారుణాలు ఎక్కువయ్యాయి. ఆగష్టు 2నే ఓ నాలుగేళ్ల బాలికను ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ అమానవీయ ఘటనపై యావత్ రాష్ట్రం నివ్వెరబోయింది. ఇదే గాక ఇంతకు ముందే జోద్‌పూర్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఈ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ దారుణ ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఈ మేరకు చట్టాలను తీసుకువచ్చింది. 

ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ..


 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)