Breaking News

చార్‌ధామ్ యాత్రపై BKTS కమిటీ కీలక నిర్ణయం

Published on Mon, 01/26/2026 - 15:45

చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బద్రినాథ్, కేదారినాథ్, గంగోత్రి తీర్థయాత్రలకు కేవలం హిందుా మతస్థులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపింది. ఇక నుంచి అన్య మతస్థులను ఎట్టి పరిస్థితుల్లో తీర్థయాత్రలకు అనుమతించమని స్పష్టం చేసింది.

బద్రినాథ్, కేదారినాథ్ టెంపుల్ కమిటీ (BKTS) ఛైర్మన్ హిమంత్ ద్వివేదీ మాట్లాడుతూ.  "హిందుయేతరులకు ధామ్, ముఖ్భాలో ప్రవేశం పూర్తిగా నిషేదం ఉత్తరాఖండ్ లోని ఆలయాల సంస్కృతిని పరిరక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో కూడా కేదారినాథ్ చుట్టుప్రక్కల ఆలయాలలో అన్య మతస్థులకు ప్రవేశం ఉండేది కాదు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఈ నియమం తరచుగా ఉల్లంఘించబడింది." అన్నారు. అంతేకాకుండా BKTS పరిధిలోని అన్ని ఆలయాలలోకి హిందుయేతరులు ప్రవేశించకుండా త్వరలో జరిగే బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఉత్తరాఖండ్ ఆలయాల పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం ఆలయాల కమిటీలతో కలిసి పనిచేస్తుందని ఆలయ కమిటీ ఛైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.  అయితే ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ఆలయ కమిటీల సిపార్సులకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 19న అక్షయతృతీయ సందర్భంగా తెరుచుకోగా బద్రినాథ్ ఆలయం ఏప్రిల్ 23న తెరుచుకుంటుంది . వీటితో పాటు రుద్రప్రయాగ్‌లోని కేదారినాథ్  ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుంది అనే విషయం మహా శివరాత్రి రోజున ప్రకటిస్తారు.

యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ నాలుగు ధామాలను కలిపి చార్ ధామ్ అంటారు. హిందువులకు ఈ యాత్ర ఎంతో ప్రత్యేకం.  చార్ ధామ్ యాత్రను యమునోత్రి నుంచి ప్రారంభించి, తర్వాత గంగోత్రి, కేదార్‌నాథ్ మరియు చివరగా బద్రీనాథ్ దర్శనంతో ఈ యాత్ర ముగుస్తుంది. చార్ ధామ్ యాత్ర సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో ప్రారంభమై వాతావరణ పరిస్థితులను బట్టి అక్టోబర్ లేదా నవంబర్ వరకు కొనసాగుతుంది.

 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)