Breaking News

అబ్బురపరిచే నిర్మాణం.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే

Published on Mon, 08/21/2023 - 07:51

న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అదివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వీడియోను విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేస్తూ  దాని కింద ఇంజినీరింగ్ యొక్క ఘనత.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే.. అత్యాధునికమైన కళాత్మక భవిష్యత్తుకు నాంది.. అని రాశారు.  

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన భారతదేశంలోనే మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే. నేషనల్ హైవే నెంబర్ 8 పై ఉన్న శివ మూర్తి నుండి ప్రారంభమై ఖేర్కి దౌలా వద్ద ముగిసే ఈ నాలుగు లైన్ల ప్యాకేజీ హైవే 563 కి.మీ వెడల్పుతో నిర్మితమైంది.ఈ ప్రాజెక్టు కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏకంగా 1200 చెట్లను తిరిగి నాటారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ హర్యానా మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయి. వీడియోలో చూపిన వివరాల ప్రకారం ద్వారకా నుండి మానేసర్ వరకు 15 నిముషాలు మానేసర్  నుండి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 20 నిముషాలు ద్వారకా నుండి సింఘు సరిహద్దు వరకు 25 నిముషాలు మానేసర్ నుండి సింఘు సరిహద్దు వరకు 45 నిముషాల వరకు ప్రయాణ సమయం ఉంటుందని తెలిపింది కేంద్ర రవాణా శాఖ.     

ఈ హైవే నిర్మాణం గనుక పూర్తయితే ద్వారకా సెక్టర్ 25లోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీని బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా మూడు లైన్ల సర్వీసు రోడ్లను కూడా నిర్మించారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సుమారు రెండు లక్షల టన్నుల ఉక్కును వినియోగించినట్టు ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ కాగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీటు వినియోగించగా ఇది దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో వినియోగించిన దానికంటే ఆరు రేట్లు  ఎక్కువ కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు..

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)