Breaking News

దీదీ.. రాజీనామా చేయండి: నిర్భయ తల్లి డిమాండ్‌

Published on Sat, 08/17/2024 - 17:31

ఢిల్లీ: కోల్‌క‌తాలోని ఆర్జీ కార్‌ మెడిక‌ల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. ఈ సందర్బంగా హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారామె.

ఆర్జీ కార్ మెడిక‌ల్ కాలేజీలో ట్రైనీ డాక్ట‌ర్‌పై హత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి స్పందిస్తూ.. అఘాయిత్యాల‌ను నిలువ‌రించ‌డంలో సీఎం మమతా బెనర్జీ విఫ‌ల‌మైన‌ట్లు విమర్శించారు. నిందితుల‌ను శిక్షించ‌డానికి బ‌దులుగా.. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో డైవ‌ర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రజలను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమె కూడా మ‌హిళే అని, రాష్ట్ర సీఎంగా ఉన్న ఆమె నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ఇదే సమయంలో అత్యాచారాలకు పాల్పడుతున్న వారి విషయంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన శిక్ష‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్‌ చేశారు. లేదంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌న్నారు. కోల్‌క‌తా మెడిక‌ల్ కాలేజీలో అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ లేకుంటే, అప్పుడు దేశంలోని మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ ఎక్క‌డ ఉంటుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు.

మరోవైపు.. ఆగ‌స్టు 9వ తేదీన ఆర్జీ కార్ మెడిక‌ల్ కాలేజీలో ట్రైనీ డాక్ట‌ర్ రేప్‌, హ‌త్య‌కు గురైంది. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వైద్యసేవలను నిలిపివేశారు. ఇక, కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు