Breaking News

గుడ్లవల్లేరు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

Published on Tue, 09/03/2024 - 05:01

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనలో వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలను చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నో రోజులుగా వ్యవహారం జరుగుతున్నా బయటకెందుకు రాలేదని ప్రశి్నంచింది. అర్థరాత్రి వరకూ విద్యార్థినులు ధర్నా చేయడం.. ఘటనపై వివిధ పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచి్చనట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.

పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై  సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది. విద్యార్థినుల వీడియోలను రహస్య కెమెరాలతో రికార్డ్‌ చేసి, వాటిని అమ్మడం వంటి వ్యవహారాలు జరగడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడింది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందని తీవ్రస్థాయిలో ప్రశి్నంచింది.  రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం తమకు వివరించాలని అందులో పేర్కొంది. 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)